Begin typing your search above and press return to search.

నేను తుమ్మితే 'తుఫాన్' వస్తుంది

ఎదుటి వ్యక్తిని నువ్వు ఓడిపోతావు అని ఎలా చెబుతాం’’ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 12:30 AM GMT
నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది
X

‘‘నేను పాలమ్మిన, పూలమ్మిన, బోర్ వెల్ నడిపిచ్చిన, కష్టపడ్డ, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయిన’’ అన్న ఒక్క డైలాగ్ కొడితే ప్రపంచమే పరేషాన్ అయింది. సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుంది. పగవాడిని కూడా ప్రేమగా చూసే మనిషిని నేను. శుభకార్యంలో ఎదురుపడ్డ వ్యక్తిని మాట వరసకు గెలుస్తవ్ అంటే దానిని వైరల్ చేస్తున్నరు. ఎదుటి వ్యక్తిని నువ్వు ఓడిపోతావు అని ఎలా చెబుతాం’’ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

ఓ పెళ్లిలో ఎదురుపడ్డ ఈటెల రాజేందర్ తో మల్కాజ్ గిరి నుండి గెలువబోయేది నువ్వే అన్న విషయం మీడియాలో హైలైట్ అయ్యింది. తాజాగా దాని మీద మల్లారెడ్డి పైవిధంగా స్పందించాడు. ఈటెల రాజేందర్ కు అసలు మల్కాజ్ గిరిలో ఓటు హక్కు లేదు. ఆయన స్థానికుడు కాదు మరి ఆయన ఎలా గెలుస్తాడు ? మల్కాజ్ గిరిలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే. బీజేపీ నేతలు రాముడు, అక్షింతలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మల్లారెడ్డి విమర్శించాడు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో పసలేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని, కాంగ్రెస్ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్టుకోవడానికి సరిపోతుందని మల్లారెడ్డి విమర్శించారు. తెలంగాణను అభివృద్ది చేసింది కేసీఆర్ మాత్రమేనని, కాంగ్రెస్ ఏం చేస్తున్నదో ప్రజలు చూస్తున్నారని అన్నాడు. తన పంచ్ డైలాగులతో నిత్యం మీడియాలో ఉండే మల్లారెడ్డి కొన్నాళ్లు స్థబ్దుగా ఉన్నాడు. మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మరోసారి మీడియాలో వైరల్ అవుతున్నాడు.