Begin typing your search above and press return to search.

"అన్నా నువ్వే గెలుస్తున్నావ్..."... ఈటెలతో మల్లారెడ్డి అలయ్ బలయ్!

ఈ సమయంలో ఈసారి మైక్ పట్టుకోకుండానే మల్లారెడ్డి సంచలనం క్రియెట్ చేశారు.

By:  Tupaki Desk   |   26 April 2024 10:26 PM IST
అన్నా నువ్వే గెలుస్తున్నావ్...... ఈటెలతో మల్లారెడ్డి అలయ్  బలయ్!
X

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆరెస్స్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెపాలి. "పాలమ్మినా.. పూలమ్మినా.." అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో మల్లారెడ్డి మైకందుకుంటే చాలు ఏదో ఒక వైరల్ వ్యాఖ్య చేస్తారనే ప్రచారం కూడా మొదలైపోయింది. ఈ సమయంలో ఈసారి మైక్ పట్టుకోకుండానే మల్లారెడ్డి సంచలనం క్రియెట్ చేశారు.

అవును... మైకందుకుంటే చాలు తనదైన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతారనే పేరు సంపాదించుకున్న మల్లారెడ్డి... మరోసారి హాట్‌ టాపిక్‌ గా మారారు. ఇందులో భాగంగా... తాజాగా మాల్కాజ్‌ గిరి లోక్‌ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... శుక్రవారం హైదరాబాద్‌ లోని కేఎస్సార్ ఫంక్షన్ హాలులో ఓ వివాహ వేడుకల్లో బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ మాల్కాజ్‌ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి.. "అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్" అంటూ బీజేపీ నేత ఈటలను కౌగిలించుకున్నారు. ఇదే సమయంలో... "అన్నతో ఫోటో తీయండి" అని అక్కడ ఉన్నవారిని కోరారు.

ఈ సందర్భంగా అక్కడున్నవారు ఫోటోలు తీయగా... మరోవైపు ఇద్దరి నేతలతో కలిసి పలువురు ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.