Begin typing your search above and press return to search.

రజనీతో మలేషియా ప్రధాని... కండెక్టర్ స్టైల్ వీడియో వైరల్!

అవును... రజినీకాంత్ ఈ మధ్య బెంగుళూరులోని రాఘవేంద్ర ఆలయాన్ని సందర్శించారు.

By:  Tupaki Desk   |   11 Sept 2023 5:58 PM IST
రజనీతో మలేషియా ప్రధాని... కండెక్టర్  స్టైల్  వీడియో వైరల్!
X

సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాయికీ.. ఆయన సింపుల్ సిటీకి అద్దంపట్టే రెండు సంగటనలు ఒకేసారి ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒక సంఘటనకు... ఇది రజనీ కాంత్ రేంజ్ అని కామెంట్ చేస్తుంటే... మరో సంఘటనలో రజనీకాంత్ కండక్టర్ రోజులు మరిచిపోలేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రెండు ఘటనలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం!

రజనీకాంత్ రేంజ్ గురించి, ఆయన సింపిల్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా మలేషియా టూర్ లో ఉన్న రజనీకాంత్ ని ఆ దేశ ప్రధాని కలవడం ఇప్పుడు వైరల్ గా మారింది. అవును... మలేషియాకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీతో ఆ దేశ ప్రధాని భేటీ అయ్యారు. ఇదే విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ లో తెలిపారు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం... రజనీకాంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... ఆసియాతో పాటు అంతర్జాతీయ కళా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నటుడు రజనీకాంత్ ని కలిసినట్లు అన్వర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో రజనీకాంత్ తో ఏయే విషయాలు చర్చించిందీ ఆయన వివరించారు.

ఇందులో భాగంగా... భవిష్యత్తులో ఆయన చేసే సినిమాల్లో సామాజిక అంశాలను చేర్చాలని తాను సూచించానని మలేషియా ప్రధాని ట్విట్టర్ లో వెల్లడించారు. రజనీని కలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీంతో... ఇది రజనీ రేంజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా తలైవాకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది. ఇందులో ఓ ఆలయానికి వెళ్లిన తలైవా.. అక్కడ పురోహితుడికి దక్షిణ వేసిన విధానంపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

అవును... రజినీకాంత్ ఈ మధ్య బెంగుళూరులోని రాఘవేంద్ర ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో లాల్చీ ధరించిన ఆయన ఆ చేతులను మడతపెట్టి అందులో డబ్బులు పెట్టారు. ఆ సమయంలో ఆ మడత విప్పి అందులో నుంచి డబ్బులు తీసి పురోహితుడి దగ్గర దక్షిణం వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రజినీ మాత్రమే ఇలా దక్షిణ వేయగలరని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ట్వీట్ చేయగా... అది "కండక్టర్ స్టైల్" అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినదానికీ కానిదానికీ అసిస్టెంట్లను పెట్టుకునే జనాలున్న ఈ రోజుల్లో తలైవా సింపుల్ సిటీ కథే వేరని అంటున్నారు.