మైత్రీవనం చౌరస్తాలో టెన్షన్.. కోచింగ్ సెంటర్ లో మంటలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితమైన సెంటర్ ఏదైనా ఉందంటే అది అమీర్ పేటలోని మైత్రీవనం.
By: Garuda Media | 20 Feb 2026 1:54 PM ISTతెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితమైన సెంటర్ ఏదైనా ఉందంటే అది అమీర్ పేటలోని మైత్రీవనం. ఇక్కడి కోచింగ్ సెంటర్ల లో ప్రతి తెలుగు విద్యార్థి ఏదో ఒక సందర్భంలో రావటం.. అవసరమైన కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడకు రావటం మామూలే. అంతటా తెలుగు యూత్ కు కనెక్టు అయ్యే మైత్రీవనం సెంటర్ లోని ఒక కోచింగ్ సెంటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.అక్కడి కోచింగ్ సెంటర్ లోని నాలుగో అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థిత నెలకొంది. ఓవైపు భారీ మంటలు.. మరోవైపు దట్టమైన పొగతో లోపల చిక్కుకునన విద్యార్థులు తీవ్రంగా టెన్షన్ కు గురవుతున్నారు. ఆదిత్య ఎన్ క్లేవ్ కాంప్లెక్స్ లోని నాలుగో అంతస్తులో అగ్ని రాజుకుంది. మంటలు రేగిన భవనంలో విద్యార్థులు చిక్కుకుపోయారు. మంటలు.. పొగతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు కిందకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మంటల తీవ్రతతో ఆ దిశగా ప్రయత్నాలు చేయలేని పరిస్థితి.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నంతో పాటు.. కోచింగ్ సెంటర్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల్నిరక్షించే పనిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నిమిగ్నమయ్యారు.దీంతో.. అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంటల్లో ఎంత మంది విద్యార్థులు చిక్కుకున్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
