కవితను 'కీలక పాయింట్`తో కొట్టిన మహేష్
ఇక, మరో కీలక విషయం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయాన్ని కవిత తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడంపై కూడా మహేష్ గౌడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 12 July 2025 8:14 PM ISTబీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ గౌడ్ కీలక పాయింట్లతో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కవిత ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ``చెల్లిదొక తీరు.. అన్నదొక తీరు.. కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకైనా తెలి యాలి కదా! అదే అడుగుతున్నం. చెప్పరా మరి!`` అని కామెంట్ చేశారు. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నాయకులు దాదాపు ఇదే పాయింట్‌పై కవితను ఏకేస్తున్నారు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం.. మెడలో ఒకప్పడు బీఆర్ ఎస్ జెండా ఉంటే.. ఇప్పుడు దానిని ఆమె విస్మరించడం వంటివాటిని ఇటీవల ఓ మంత్రి కూడా కార్నర్ చేసిన విషయం తెలిసిందే.
ఇక, మరో కీలక విషయం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయాన్ని కవిత తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడంపై కూడా మహేష్ గౌడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అసలు తాము.. రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసే సమయానికి కవిత ఎక్కడున్నా రో ఒకసారి ఆలోచన చేసుకోవాలని సూచించారు. ``అప్పట్లో ఆమె ఎక్కడుంది? తీహార్ జైల్లో పుస్తకాలు చదువుతూ.. ఎప్పుడు బెయిలొస్తదా? ఎప్పుడు బయటకొస్తమా? అని ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆమె.. రిజర్వేషన్ల ఘనత తమదేనని చెబుతోంది. మరి ఆమె ఆలోచన చేసుకోవాలి. ఏనాడైనా బీఆర్ ఎస్.. బీసీల రిజర్వేషన్లపై పనిచేసిందా? ఉన్నవి ఊడగొట్లలేదా?`` అని మహే ష్ గౌడ్ ప్రశ్నించారు.
బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటేనన్న మహేష్ గౌడ్.. పార్లమెంటులో 2014-19 మధ్య అనేక బిల్లులకు ఓటేయలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల సమస్యలై పోరాటం చేయాలని.. మంచి చేస్తున్న ప్రభుత్వంపై కాదని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. ``ఈ రోజు మీకు గ్రామల్లో పర్యటించి.. ప్రజలను పరామర్శిం చే ధైర్యం ఉందా? అసలు మీరు వెళ్లగలరా?`` అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. 18 నెలల కాలంగా తెలంగాణ సమాజాన్ని సీఎం రేవంత్ రెడ్డి కడుపులో పెట్టుకుని చూస్తున్నారన్న ఆయన.. పేదల నుంచి నిరుద్యోగుల వరకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని.. వీటిని బీఆర్ ఎస్ నాయకులు కూడా అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారని ఆయన తెలిపారు.
