Begin typing your search above and press return to search.

గాంధీ వాచీ.. చరఖానే కాదు.. వీలునామా కూడా విలువైనదే

గాంధీజీ అంటే సూటు వేసుకుని దక్షిణాఫ్రికాలో బారిష్టర్ గా పనిచేసిన వ్యక్తి కాదు.. చేతిలో ఊత కర్ర, కొల్లాయి కట్టిన రూపమే మనకు కదలాడుతుంది

By:  Tupaki Desk   |   2 Oct 2023 9:22 AM GMT
గాంధీ వాచీ.. చరఖానే కాదు.. వీలునామా కూడా విలువైనదే
X

నిలువెత్తు అహింసామూర్తి ఆయన.. నడుస్తున్న మానవతా వాది ఆయన.. అలాంటి వ్యక్తి అడుగేసిన నేల కూడా పవిత్రమే.. అందుకే ఆయన వాడిన వస్తువులూ అపురూపమే.. ఇదంతా భారత జాతి పిత మహాత్మా గాంధీ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు ఆయన జయంతి.. కారణ జన్ములను భగవంతుడు పని పూర్తయిన వెంటనే తీసుకెళ్లిపోతాడని అంటారు.. అందుకేనేమో భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన కొద్ది రోజులకే గాంధీని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే..

నిరాడంబరతకు ప్రతిరూపం

గాంధీజీ అంటే సూటు వేసుకుని దక్షిణాఫ్రికాలో బారిష్టర్ గా పనిచేసిన వ్యక్తి కాదు.. చేతిలో ఊత కర్ర, కొల్లాయి కట్టిన రూపమే మనకు కదలాడుతుంది. అందులోనూ నడుము దగ్గర కపనిపించే ఆయన వాచీ మనకు ఓ గుర్తుగా మిగిలిపోయింది. నేడు గాంధీజీ జయంతి సందర్భంగా గుర్తుంచుకోదగిన అంశం ఆయన ప్రవచించిన ''అహింసా సిద్ధాంతం''.

తుపాకీ స్వామ్యం వద్దని

అమెరికాలో గన్ కల్చర్ ఎందుకుంది..? లేదా సాయుధ విప్లవాలతో స్వాతంత్ర్యం సాధించిన దేశాల్లో ఇప్పటికీ అశాంతి ఎందుకు రేగుతోంది? దీనికి సమాధానం అవి స్వాతంత్ర్యం పొందిన మార్గాలే. కానీ, గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిన భారత్ లో మాత్రం అశాంతి-హింసకు తావు లేకపోయింది. ఇందుకు గాంధీజీని ఎంతైనా అభినందించాల్సిందే. అందుకే ''చరిత్రలో ఇలాంటి వ్యక్తి రక్త మాంసాలతో జీవించాడా?'' అని ముందు తరాల వారు భావిస్తారని ఐన్ స్టీన్ వంటి ప్రఖాత్య శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.

ఆయన వస్తువులు అపురూపమే..

గాంధీజీ వినియోగించిన వస్తువులను గతంలో వేలం వేశారు. వీటిలో కొన్నటికి అత్యధిక ధర పలకడం గమనార్హం. అయితే, వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడైంది. ఇక గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు అమ్ముడైంది. ఇది ఇప్పటి భారత కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుంచి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత కరెన్సీలో రూ.19 లక్షలు. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917-1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వాడిన చెప్పులు దొరికాయి.