మహారాష్ట్ర మంత్రి.. ర్యాపిడో బుక్ చేసి.. రైడర్‌ను ఎడాపెడా వాయించేసి
అయితే, మహారాష్ట్ర మంత్రి తీరులో తప్పేమీ లేదు. ముంబైలో బైక్ ట్యాక్సీలను రద్దు చేశారు. అయినప్పటికీ అనధికారికంగా నడుపుతున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 7:00 AM ISTసహజంగా ట్రాన్స్‌పోర్ట్ యాప్‌లో క్యాబ్, బైక్ బుక్ చేసినవారు ఏం చేస్తారు..? రైడర్ బైక్‌తోనో, కారుతోనో రాగానే వన్ టైమ్ పాస్‌వర్డ్ చెప్పి ఎక్కేస్తారు. తాము కోరుకున్న గమ్యం రాగానే దిగిపోతారు..! మధ్యలో రైడర్ తీరు నచ్చితే మాట ముచ్చట చేస్తారు..! కానీ, మహారాష్ట్ర మంత్రి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు. అలాగని రైడర్‌తో ఆయన రగడకు దిగలేదు.. నాలుగు మాటలు చెప్పి.. పంపించారు.
ఇదంతా మహారాష్ట్రలో జరిగింది. ఆ రాష్ట్ర రవాణా మంత్రిగా ఉన్నారు ప్రతాప్ బాబూరావు సర్నాయక్. తాజాగా ఆయన చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రతాప్ బాబూరావు ముంబైలో ర్యాపిడో బైక్ బుక్ చేశారు. సమయానికి రైడర్ కూడా వచ్చారు. అతడు హెల్మెట్ కూడా పెట్టుకునే ఉన్నాడు. కానీ, అతడిని మంత్రి బాబూరావు మాత్రం వదల్లేదు. నేరుగా దగ్గరకు వెళ్లి గట్టిగా మందలించారు.
అయితే, మహారాష్ట్ర మంత్రి తీరులో తప్పేమీ లేదు. ముంబైలో బైక్ ట్యాక్సీలను రద్దు చేశారు. అయినప్పటికీ అనధికారికంగా నడుపుతున్నారు. అందుకే బాబూరావు మంత్రి హోదాలో ఈ నిర్ణయం ఎలా అమలవుతుందో చూడాలనుకున్నారు. స్వయంగా బైక్ బుక్ చేశారు. ఆ రైడ్‌ను యాప్ స్వీకరించడమే కాదు.. రైడర్ కూడా వచ్చేశాడు. దీంతో మంత్రి.. సంబంధిత ర్యాపిడో రైడర్‌కు హిత వచనాలు చెప్పారు. ముంబైలో బైక్ ట్యాక్సీలు చట్ట విరుద్ధం అనే సంగతిని గుర్తుచేశారు. అయినా, యాప్‌దే తప్పు కాబట్టి రైడర్‌ను ఏమీ అనలేదు. పైగా రూ.500 ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు మంత్రి. రైడర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని కూడా అభయమిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా క్యాబ్ అగ్రిగేటర‍్లకు కేంద్ర ప్రభుత‍్వం మంచి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది రోజూ క్యాబ్‌లలో వెళ్లేవారికి షాక్. కేంద్రం కొత్త నిర్ణయం ప్రకారం రద్దీ వేళ్లలో ప్రాథమిక (బేస్) చార్జీపై రెట్టింపు రుసుము వసూలు చేసుకోవచ్చు. దీంతో ఉబర్, ఓలా, ర్యాపిడోలకు బంపర్ ఆఫరే.
