ఇతడి జీతం రూ.4.5 లక్షలు... ఏమి పనో తెలిస్తే షాక్ తప్పదు!
దీంతో అతని స్థూల ఆదాయం మొత్తం రూ.5.7 లక్షలు కాగా.. ఖర్చుల తర్వాత అతని నికర టేక్ హోమ్ దాదాపు రూ.4.5లక్షలు అని చెబుతున్నారు.
By: Tupaki Desk | 22 July 2025 12:00 PM ISTచదువుకీ, సంపాదనకీ సంబంధం లేదని అంటారు. కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకుని వేలల్లో సంపాదిస్తుంటే.. మరికొంతమంది క్రియేటివ్ గా ఆలోచించి లక్షల్లో సంపాదిస్తున్నారు! ఇక్కడ చదువు ప్రసక్తి లేకుండా కావడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ డాగ్ వాకర్ కథ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా యువతకు ఇతడు ఆదర్శం అని అంటున్నారు!
అవును... మహారాష్ట్రకు చెందిన ఓ డాగ్ వాకర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాగ్ వాకర్ లక్షలు సంపాదిస్తున్నాడు. కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడనే చర్చకు తెరలేపాడు! ఈ క్రమంలో అతను రూ.4.5 లక్షలు సంపాదిస్తున్నాడు! ఇతడు ప్రతీ రోజూ 38 కుక్కలను వాకింగ్ కి తీసుకెళ్తాడు.
ప్రతీ రోజూ రెండు సార్లు వాకింగ్ తీసుకెళ్లడం కోసం ఒక్కో కుక్కకు రూ.15,000 వసూలు చేస్తున్నాడు. దీంతో అతని స్థూల ఆదాయం మొత్తం రూ.5.7 లక్షలు కాగా.. ఖర్చుల తర్వాత అతని నికర టేక్ హోమ్ దాదాపు రూ.4.5లక్షలు అని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ 38 కుక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రెండు పూటలా వాకింగ్ కి తీసుకెళ్తున్నాడు.
కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా... వాటి ఫిట్ నెస్, శ్రేయస్సును కూడా జాగ్రత్తగా చూసుకుంటాడట. దీంతో అతనికి డిమాండ్ కూడా చాలా పెరిగింది. దీంతో.. విలాసవంతమైన ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ పెంపుడు జంతువుల కోసం ఇతడిని రిక్రూట్ చేసుకుంటున్నారు. అడిగిన మొత్తంలో చెల్లిస్తున్నారు. దీంతో... ఇతడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు ఈ డాగ్ వాకర్ సోదరుడు ఎంబీఏ గ్రాడ్యుయేట్.. నెలకు కేవలం 70వేలు మాత్రమే సంపాదిస్తున్నాడని చెబుతున్నారు. అంటే... ఎంబీయే చేసిన తన సోదరుడి కంటే ఈ డాగ్ వాకర్ ఆదాయం సుమారు ఆరు రెట్లు కంటే ఎక్కువన్నమాట!
కాగా... భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఈ రంగం 2026 నాటికి ₹7,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా... ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్స్, పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.
