47 మందిని 280 సార్లు చంపారు... ఏమిటీ పాము కాటు స్కామ్?
అవును... మధ్యప్రదేశ్ లో "పాము కాటు స్కామ్" ఒకటి వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే.. ఏకంగా 280 సార్లు వారి మరణాన్ని నమోదు చేసిన అధికారులు భారీ స్కామ్ కు తెరలేపారు.
By: Tupaki Desk | 23 May 2025 9:36 AM ISTమధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒకసారి మరణించినవారిని ఎన్నో సార్లు అధికారికంగా చంపేసిన అధికారుల వైనం వెలుగు చూసింది! దీనిపేరు పాము కాటు కుంభకోణం! ఈ క్రమంలో ఒక జిల్లాల్లో 47 మంది మరణిస్తే.. ఏకంగా 280 సార్లు మరణించినట్లు చూపించిన అధికారులు గట్టిగానే వెనకేశారు! భారీ కుంభకోణానికి తెరలేపారు!
అవును... మధ్యప్రదేశ్ లో "పాము కాటు స్కామ్" ఒకటి వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే.. ఏకంగా 280 సార్లు వారి మరణాన్ని నమోదు చేసిన అధికారులు భారీ స్కామ్ కు తెరలేపారు. ఈ క్రమంలో.. ప్రతీసారీ రూ.4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయంగా పొందారు ఫలితంగా మొత్తం రూ.11.26 కోట్ల అవినీతి జరిగిందని తేలింది!
రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ లో 37 మందిని నిందితులుగా చేర్చగా.. ప్రధాన నిందితుడితో సహా 20 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన రెవెన్యూ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ అధికారి రోహిత్ సింగ్ కౌశల్ ఈ స్కామ్ ఎలా జరిగిందనే విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఉదాహరణకు ద్వారకా బాయి అనే మహిళ పాముకాటుతో మరణించగా.. ఆమె పేరుతో అధికారులు 29 సార్లు చనిపోయినట్లు నమోదు చేశారు! ఇలా ప్రతీసారీ ఆమె పేరు మీద రూ.4 లక్షల సహాయం రాబట్టారు. ఫలితంగా.. ఆమె ఒక్క పేరు మీదనే రూ.1.16 కోట్లు సంపాదించారు. దీనికోసం పలు ఫేక్ ఆధారాలు సృష్టించారు!
2019-22 మధ్యకాలంలో ఈ నిధుల దుర్వినియోగం జరిగినట్లు చెబుతున్నారు. దర్యాప్తు తర్వాత రూ.11.26 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన అధికారులు.. 47 మంది ఖాతాలకు ఈ మొత్తం సొమ్ము ట్రాన్స్ ఫర్ అయినట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
