Begin typing your search above and press return to search.

మాధవి లతకు కేంద్రం వైప్లస్ సెక్యూరిటీ ఎందుకు కేటాయించారు? కారణం ఏంటి?

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి మాధవీలతకు రక్షణ కల్పిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 April 2024 9:33 AM GMT
మాధవి లతకు కేంద్రం వైప్లస్ సెక్యూరిటీ ఎందుకు కేటాయించారు? కారణం ఏంటి?
X

దేశంలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి మాధవీలతకు రక్షణ కల్పిస్తున్నారు. ఆమెకు వై+ భద్రత అందిస్తున్నారు. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు రక్షణగా ఉంటున్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న ఆమెకు కేంద్రం పటిష్ట భద్రత ఇస్తోంది. ఆమె రక్షణకు చేయూత అందిస్తోంది. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయడమే వారి ఉద్దేశం. దీంతో ఆరుగురు సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉంటారు. ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద కాపలా కాయనున్నారని తెలుస్తోంది.

రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలకు కేంద్రం వై+ భద్రత కల్పిస్తోంది. వారి రక్షణ కర్తవ్యంగా భావిస్తోంది. ఇందులో భాగంగానే వారికి ప్రత్యేక భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. దీని కోసం వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమదేనని చెబుతోంది. ఈనేపథ్యంలో మాధవీలతకు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

దేశంలో బీజేపీ నేతల పోటీతో వివాదాస్పద ప్రాంతాల్లో రక్షణ ఇస్తున్నారు. ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ పై పోటీ చేసిన మాధవీలత కోసం సెక్యూరిటీ కల్పించడం గమనార్హం. దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా తమ పార్టీ నేతలు పోటీలో ఉన్న చోట్ల ప్రత్యేక భద్రత ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది. దీంతోనే మాధవీలత కోసం సెక్యూరిటీ పెంచింది. ఈ నేపథ్యంలో మాధవీలత రక్షణకు చర్యలు తీసుకుంది.

ప్రముఖుల కోసం సెక్యూరిటీ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అత్యంత వివాదాస్పదుడైన అసదుద్దీన్ ఓవైసీపై పోటీలో ఉండటంతో వారేదైనా ప్రమాదం తీసుకొస్తారోననే ఉద్దేశంతోనే ఆమెకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమే. అందుకే ఆమెకు రక్షణ కల్పించి తిరగడానికి అవకాశం ఇస్తోంది.