Begin typing your search above and press return to search.

బర్డ్స్ ఆఫ్ సేంకలర్ ఫ్లోక్ టుగెథర్... డ్రగ్ కేసులో డీసీపీ కీలక వ్యాఖ్యలు!

అవును... సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వినీత్ స్పందించారు. ఇందులో భాగంగా డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 2:05 PM GMT
బర్డ్స్ ఆఫ్ సేంకలర్ ఫ్లోక్ టుగెథర్... డ్రగ్ కేసులో డీసీపీ కీలక వ్యాఖ్యలు!
X

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సుమారు 10 మంది పేర్లు ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చబడ్డాయంటూ కథనాలొచ్చిన వేళ... ఆ పదో పేరు డైరెక్టర్ క్రిష్ ది అనే విషయం వార్తల్లోకి రావడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... రాడిసన్ హోటల్ డ్రగ్ కేసుపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, కేసు పొజిషన్ ఏమిటి మొదలైన విషయాలు వెల్లడించారు!

అవును... సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ డ్రగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వినీత్ స్పందించారు. ఇందులో భాగంగా డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వివేకానందకు.. పెడ్లర్ అబ్బాస్ ఇప్పటికివరకూ సుమారు 10సార్లు కొకైన్ డెలివరి చేసినట్లు తెలిసిందని అన్నారు. ఇదే క్రమంలో... మరికొంతమంది పరారీలో ఉన్నారని.. వారికో ఒకరు బెంగళూరులో ఉన్నట్లు తెలిసిందని అన్నారు. ఇదే క్రమంలో డైరెక్టర్ క్రిష్ విషయంపైనా డీసీపీ స్పందించారు.

ఇదే క్రమంలో విభిన్న సర్కిల్స్ కి సంబంధించిన వ్యక్తులు ఒకేచోట పార్టీలో కలవడంపై స్పందించిన ఆయన... వారందరికీ కామన్స్ ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చని అన్నారు. ఈ సందర్భంగా "సేం కలర్ బర్డ్స్ ఫ్లోక్ టుగెథర్" అన్నట్లుగా కలిసిపోతారని తెలిపారు. ఇదే సమయంలో ఈ డ్రగ్ కేసులో పట్టుబడివారిలో ఎవరూ మైనర్లు లేరని.. అంత మేజర్లే అని డీసీపీ స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా... డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నట్లు తమకు సమాచారం ఉందని.. అయితే ఆయన విచారణకు వచ్చిన అనంతరం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే ముందుగా అరెస్టైన వివేకానంద, నిర్భయ్, కేదార్ లు కొకైన్ సేవించినట్లుగా నిర్ధారణ అయ్యిందని.. ఈ మేరకు వారి యూరిన్ రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ తెలిపారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ కూడా విచారణకు వస్తానని అన్నారు!

ఇదే క్రమంలో... రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని చెప్పిన డీసీపీ వినీత్... రిమాండ్ రిపోర్ట్ రెడీ లో అన్న్ని విషయాలనూ వెల్లడిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నిందితులు అందరి రక్త, మూత్ర పరీక్షల ఫలితాల అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇక డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఇద్దరు యువతులు సహా 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు!