Begin typing your search above and press return to search.

ఎవరెస్ట్ నే దాటే హెలికాప్టర్లు- మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్

ఇదిలా ఉంటే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మకమైన బంధం ఉందని మోడీ ప్రకటించడం విశేషం.

By:  Satya P   |   18 Feb 2026 4:00 AM IST
ఎవరెస్ట్ నే దాటే హెలికాప్టర్లు- మేడ్ ఇన్ ఇండియా  బ్రాండ్
X

మేడ్ ఇన్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అని త్వరలోనే రుజువు కాబోతోంది. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాలనే దాటి ఇంకా ఎత్తుకు ఎగిసి గగన తనంలో విహరించే హెలికాప్టర్ల తయారీ ఫ్యూచర్ లో భారత్ లో జరగబోతోంది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కర్ణాటకలోని వేమగల్ లో ఎయిర్ బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్ ని ప్రధాని మడీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలసి వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్రాన్స్ సాయంతో భారత్ లో తయారు చేసే హెలికాప్టర్లు ఎవరెస్టుని సైతం అధిగమించి గగన తలంలో దూసుకుని పోయే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటాయని మోడీ అంటున్నారు. ఇది తొందరలోనే జరిగి తీరుతుంది అంతా చూస్తారు అని ఆయన నిబ్బరంగా చెబుతున్నారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా హెలికాప్టర్లు ఎగుమతి చేయబడతాయని కూడా అన్నారు.

వ్యూహాత్మక బంధం :

ఇదిలా ఉంటే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మకమైన బంధం ఉందని మోడీ ప్రకటించడం విశేషం. ముంబైలోని లోక్ భవన్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఒక సంయుక్త ప్రకటన చేస్తూ ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. ఫ్రాన్స్‌తో స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఏర్పాటును సైతం మోదీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం వ్యూహాత్మకమే కాకుండా ఈనాటి అస్థిర ప్రపంచ పరిస్థితుల మధ్య ప్రపంచ స్థిరత్వం శ్రేయస్సు కోసం కూడా కలసి ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. భారతదేశం ఫ్రాన్స్ మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని మోడీ అంటూ ఫ్రాన్స్ భారతదేశ పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా అభివర్ణించారు.

హద్దులు లేని భాగస్వామ్యం :

భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు తెలియవని ఎందుకంటే ఇది లోతైన మహాసముద్రాల నుండి ఎత్తైన పర్వతాల వరకు చేరుకోగలదని మోదీ అభివర్ణించారు. 2026 సంవత్సరం ఇండో-యూరోపియన్ సంబంధాలలో ఒక మలుపు అని కూడా వ్యాఖ్యానించారు. భారత్ ఈయూల మధ్య ఇటీవల జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశం ఫ్రాన్స్ మధ్య సంబంధాలను వేగవంతం చేస్తుందని మోడీ చెప్పుకొచ్చారు అలాగే, రెండు దేశాలు ద్వంద్వ పన్నులను తొలగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని, ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి పెంచుతుందని వెల్లడించారు ఇరు దేశాల భాగస్వామ్య శ్రేయస్సు రోడ్ మ్యాప్ గా మారనుందని అన్నారు. దేశాల మధ్యనే కాదు ప్రజల భాగస్వామ్యంగా కూడా ఈ బంధాన్ని మారుస్తామని చెప్పారు ప్రజల సంబంధాలను బలోపేతం చేయడం రక్షణ, స్వచ్ఛమైన శక్తి, అంతరిక్షం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి రంగాలలో సైతం ఈ రెండు దేశాల బంధం బలపడుతుందని అన్నారు.

బెస్ట్ ఫ్రెండ్ భారత్ :

ఇక ఫ్రాన్స్ భారతదేశం విశ్వసనీయ మిత్రదేశంగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ అన్నారు. అంతరిక్షం, వైమానిక శాస్త్రం, రైల్వేలు, సౌరశక్తి, మౌలిక సదుపాయాలు, సృజనాత్మక పరిశ్రమలు సాంకేతికత వంటి రంగాలలో రెండు దేశాలు ఉమ్మడి దృక్పథాన్ని పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు ఇక మీదట మరింతగా కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు.