Begin typing your search above and press return to search.

ఈ విస్కీ తాగాలంటే... రూ. 22.5 కోట్లు ఉండాలి!

అవును... మాములుగా విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ తాజాగా కోట్ల రూపాయల ధరతో ఉన్న విస్కీ బాటిల్ తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   20 Nov 2023 10:00 AM GMT
ఈ విస్కీ తాగాలంటే... రూ. 22.5 కోట్లు ఉండాలి!
X

విస్కీ తాగాలనిపిస్తే చేతిలో ఎంత డబ్బులు ఉండాలని అంటే... ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వారు, ఎవరి స్థాయికి తగ్గట్లు వారు 150 రూపాయల నుంచి మొదలుపెట్టి వేల రూపాయల దగ్గర ఆగుతారు! అతితక్కువమంది లక్షల రూపాయలకు వచ్చి ఆగొచ్చు!! అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విస్కీ బాటిల్ దక్కించుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగలిగే స్టామినా ఉండాలి!

అవును... మాములుగా విస్కీ బాటిల్ ధర ఎంత ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ తాజాగా కోట్ల రూపాయల ధరతో ఉన్న విస్కీ బాటిల్ తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన విస్కీగా రికార్డ్ నెలకొల్పింది. లండన్ లో జరిగిన ఓ ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌ బీ నిర్వహించిన వేలంలో ఈ వ్యవహారం తెరపైకి వచ్చిమి. ఈ బాటిల్ ధర తెలిసిన వారు ఔరా అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా లండన్ లో జరిగిన ఒక వేళంలో ఓ కంపెనీ తయారు చేసిన విస్కీని వేలానికి పెట్టారు. ఈ బాటిల్ సుమారు 97 ఏళ్ల క్రితం మెకలాన్‌ కంపెనీ తయారు చేసిన సింగిల్‌ మాల్ట్‌ విస్కీ అని చెబుతున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా ఈ విస్కీ బాటిల్ దాదాపు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఫలితంగా అందరినీ ఆశ్చపరిచింది.

వాస్తవానికి వేళం సమయంలో ఈ బాటిల్ ధర రూ.12 కోట్లకు అమ్మడవ్వొచ్చని అంతా అనుకున్నారంట. అయితే వారి అంచనాలను మించి ఊహకు అందని విధంగా రూ.22.5 కోట్లు పలికింది. ఫలితంగా... ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బాటిల్ ను ఏకంగా 60 ఏళ్లు డార్క్‌ ఓక్‌ వుడ్‌ పెట్టెల్లో నిలవ చేసిందట కంపెనీ.

ఈ క్రమంలో 1986లో సుమారు 40 బాటిళ్లలో ఈ విస్కీ నింపిందట. అయితే నాడు వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదట కానీ కొన్ని బాటిళ్లను మెకలాన్‌ కు వచ్చే వీఐపీ కస్టమర్లకు మాత్రం అందుబాటులో ఉంచిందట. అనంతరం కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఇలాంటి వాటిని వేలంలో ఉంచాలని నిర్ణయించారంట. ఫలితంగా... తాజాగా వారికి దక్కిన ఫలితం ఈ స్థాయిలో ఉంది.

కాగా 2019లో కూడా ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది. అప్పటికి అదే రికార్డ్. ఈ క్రమంలో తాజా వేలంలో మకాలన్ కంపెనీ తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. తాజా విస్కీ బాటిల్ రూ.22.5 కోట్లకు అమ్ముడైపోయింది.