Begin typing your search above and press return to search.

కుక్కలకూ ఓ క్రూయిజ్.. ప్రత్యేకతలు, నియమాలు ఇవే!

అవును... మనుషులు లగ్జరీ క్రూయిజ్‌ లో వెళ్లడంలో పెద్ద విషయం కాదు, వింత కాదు కానీ... అమెరికాలో ఓ నౌకాయన సంస్థ కేవలం శునకాల కోసం ప్రత్యేక క్రూజ్ ట్రిప్ ప్లాన్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2025 3:00 AM IST
కుక్కలకూ ఓ క్రూయిజ్..  ప్రత్యేకతలు, నియమాలు ఇవే!
X

పర్యాటకులు, సముద్ర ప్రేమికులకు ఇటీవల కాలంలో లగ్జరీ క్రూయిజ్ లు ఓ అద్భుతమైన అవకాశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఆప్షన్స్ మనుషులకే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే... ఈ ప్రపంచంలో మనిషితో అత్యంత సన్నిహితమైన బంధం కలిగిన శుంకాలకూ లగ్జరీ క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. వాటికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

అవును... మనుషులు లగ్జరీ క్రూయిజ్‌ లో వెళ్లడంలో పెద్ద విషయం కాదు, వింత కాదు కానీ... అమెరికాలో ఓ నౌకాయన సంస్థ కేవలం శునకాల కోసం ప్రత్యేక క్రూజ్ ట్రిప్ ప్లాన్ చేస్తోంది. ఇందులో దాదాపు 250 శునకాలతో పాటు వాటి యజమానులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్‌ లో కుక్కల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో పలు స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి.

నవంబర్ 2025లో ఫ్లోరిడాలోని పోర్ట్ టాంపా బే నుంచి ప్రపంచ తొలి లగ్జరీ డాగ్ క్రూయిజ్ బయలుదేరనుంది. ఇది పెంపుడు జంతువులకు అనుకూలమైన ప్రత్యేకమైన సముద్రయానం. మార్గరిటావిల్లే అట్ సీ, క్రూయిజ్ టేల్స్, ఎక్స్‌ పీడియా క్రూయిజ్ వెస్ట్ ఒర్లాండో కలిసి ఈ కరేబియన్ సాహసయాత్రను ఆరు రోజులు ప్లాన్ చేసింది.

దీని మీ మీ శునకాలకు స్వర్గధామంగా రూపొందించారు. కేవలం 250 అదృష్టవంతులైన కుక్కలు మాత్రమే ఈ యాత్రకు వెళ్లే ఛాన్స్ దక్కించుకుంటాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇందులో ప్రయాణించే శునకాలకు, వాటి యజమానులకు ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి. ఇదే సమయంలో శునకాలు స్పెషల్ రూల్స్ బోర్డులు కనిపించనున్నాయి.

ఇందులో భాగంగా... శునకాలకు ప్రత్యేకంగా ప్రైవేట్ బాల్కనీ రిలీఫ్ జోన్లతో పాటు ఆన్‌ బోర్డ్ గ్రూమింగ్, జలక్రీడలు, మసాజ్ సెంటర్లు, ప్లే స్టేషన్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, స్పా ట్రీట్మెంట్లు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక వాటి యజమానులకు 13 లాంజ్‌ లు, 12 రెస్టారెంట్లు, 3 స్విమ్మింగ్ పూల్స్, క్యాసినో లను సిద్ధం చేస్తున్నారు.

ఇక నియమాల విషయానికొస్తే... ఈ క్రూయిజ్ లో ప్రయాణించాలనుకునే ప్రతి కుక్కకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించి ఉండాలి. ఇదే సమయంలో వాటి ప్రవర్తన సరిగా ఉందన్న సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి. ఇప్పటికే బుక్కింగ్స్ మొదలవ్వడంతో.. ఆలసించినా ఆశాభంగం అనే కామెంట్లు కనిపిస్తున్నాయి!