Begin typing your search above and press return to search.

లుఫ్తాన్సా.. ఇదేనా ప్రయాణికులకు చూపించే నరకం

ముందే రిజర్వ్ చేసుకున్న సీట్లు కూడా మార్చి, కుటుంబ సభ్యులను వేర్వేరు చోట్ల కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

By:  Tupaki Desk   |   31 May 2025 2:45 AM
లుఫ్తాన్సా.. ఇదేనా ప్రయాణికులకు చూపించే నరకం
X

అమెరికా నుంచి జర్మనీకి ప్రయాణించేందుకు సిద్ధమైన ఒక కుటుంబానికి లుఫ్తాన్సా విమానయాన సంస్థ తలనొప్పిగా మారింది. ఫ్లైట్ మార్పు చేయించి, అదనపు ఫీజులు చెల్లించి, లుఫ్తాన్సా అధికారులతో ఫోన్ ద్వారా , ప్రత్యక్షంగా కూడా ధృవీకరణ పొందిన తర్వాత, చివరి నిమిషంలో వారి బుకింగ్ లేదని చెప్పి షాకిచ్చింది.

దక్షిణ డకొటాలోని ఎటీవై (ATY) విమానాశ్రయం నుంచి మ్యూనిక్‌కి బయలుదేరిన కుటుంబం, తమ బుకింగ్ రద్దయ్యిందని చెప్పిన వార్తకు షాక్‌కి గురైంది. విమానం బయలుదేరడానికి గంట సమయం మాత్రమే మిగిలి ఉండగా, మరోసారి అదే విమానానికి చేరేందుకు లుఫ్తాన్సా సంస్థ వారు వారికి 570 యూరోలు చెల్లించాల్సిందిగా చెప్పారు.

ముందే రిజర్వ్ చేసుకున్న సీట్లు కూడా మార్చి, కుటుంబ సభ్యులను వేర్వేరు చోట్ల కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు కూడా ఈ పరిణామానికి అర్థం చేసుకోలేకపోయారట. అంతకుముందే సంస్థ నుంచి వచ్చిన ఈమెయిల్స్, రశీదులు, కాల్ రికార్డులతో కలిపి వారు ఎలాంటి రద్దు చేయలేదని సాక్ష్యాలతో చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ కుటుంబం తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని, అలాగే ఎదురైన మానసిక ఒత్తిడికి నష్టపరిహారం కోరుతూ పోరాటం చేస్తోంది. ఇది నిజమైతే, లుఫ్తాన్సా సంస్థ తన తప్పులను సరిచేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం తక్షణం ఆపాల్సిన అవసరం ఉంది.

ఈ ఘటనపై ఇంకా లుఫ్తాన్సా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, ఇది స్పష్టమైన మోసమేనని ఆరోపిస్తున్నారు.

ఈ రకమైన ఘటనలు ప్రయాణికుల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, అంతర్జాతీయ విమానయాన సంస్థల బాధ్యతపై ప్రశ్నలు వేస్తున్నాయి.