Begin typing your search above and press return to search.

ఢిల్లీ మెట్రోలో లవ్వర్స్ కు షాకిచ్చిన పెద్దావిడ

అందరి ఎదుట చేస్తున్న అతిని ఉతికి ఆరేసిన ఒక పెద్దావిడ ఉదంతం సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 4:18 AM GMT
ఢిల్లీ మెట్రోలో లవ్వర్స్ కు షాకిచ్చిన పెద్దావిడ
X

బహిరంగ ప్రదేశాల్లో కాస్తంత డీసెంట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సభ్యతా సంస్కారం అన్నది లేకుండా.. ఏకాంతంలో చెలరేగిపోయినట్లుగా అందరి ఎదుట చేస్తున్న అతిని ఉతికి ఆరేసిన ఒక పెద్దావిడ ఉదంతం సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో రైలు పాజిటివ్ కంటే నెగిటివ్ అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ.. తరచూ వార్తల్లోకి ఎక్కటం తెలిసిందే.

తాజాగా రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రో రైల్లో ఒక యువ జంట చెలరేగిపోయింది. తాము అందరి మధ్య ఉన్న విషయాన్ని వదిలేసి.. కిస్సులు.. హగ్గులతో తేలిపోతూ.. ఒకరిపై ఒకరు ప్రైవేటు ప్రదేశాల్లో చేసే రొమాన్సును అందరి ఎదుట చేయటంతో పలువురు ఇబ్బందికి గురయ్యారు. ఇలాంటివి చేయాలా? వద్దా? అన్న విచక్షణ మరిచి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై పలువురుసైలెంట్ గా ఉండిపోయి తల పట్టుకుంటే.. ఒక పెద్దావిడ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా రియాక్టు అవుతూ.. వారిద్దరిని ఉతికి ఆరేసింది.

ఆ జంట చేష్టలతో విసిగిన ఆమె.. పబ్లిక్ గా ఇదేం పని? అందరూచూస్తుండగా ఇలా ఎలా చేస్తారు? అంటూ కడిగేసింది. ఆమె మాటలకు యువజంటలోని యువకుడు ఎదురుదాడికి దిగాడు. తమను ఎందుకు నిలదీస్తారంటూ మండిపడ్డ అతను.. ప్రశ్నించటానికి మీరెవరు? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ పెద్దావిడకు.. యువకుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కలుగజేసుకున్న మెట్రో ప్రయాణికులు.. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి.. వైరల్ గా మారింది. అయితే.. సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టుచేసిన సదరు వీడియోను కాసేపటికి తొలగించటం గమనార్హం.