Begin typing your search above and press return to search.

అంబానీ, అదానీ, టాటాలు లేరు... టాప్ లో ఒకప్పటి దినసరి కూలీ!

ఈ సమయంలో అతడు ఒకప్పుడు దినసరి కూలీ అని తెలియడంతో అతని గురించి తెలుసుకోవాలనే విషయంలో గూగుల్ సెర్చ్ పెరిగిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 March 2024 6:20 AM GMT
అంబానీ, అదానీ, టాటాలు లేరు... టాప్  లో ఒకప్పటి దినసరి కూలీ!
X

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లను ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయగానే ఒక సంస్థ పేరు ప్రముఖంగా వినిపించింది. తదనుగుణంగా ఆ సంస్థ యజమాని పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో అతడు ఒకప్పుడు దినసరి కూలీ అని తెలియడంతో అతని గురించి తెలుసుకోవాలనే విషయంలో గూగుల్ సెర్చ్ పెరిగిందని తెలుస్తుంది. దీంతో లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా పేరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.


అవును... సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను వెబ్ సైట్లో పెట్టగానే "ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్" పేరు చర్చనీయాంశం అవ్వగా.. ఆ సంస్థ యజమాని శాంటియాగో మార్టిన్‌ పేరు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రోజువారీ కూలీగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి.. నేడు భారతదేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి చేర్కోవడం గమనార్హం.

ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌ వెబ్ సైట్ లో శాంటియాగో మార్టిన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం... మార్టీన్ తొలినాళ్లలో మయన్మార్ లో కూలీగా పనిచేశారు. ఈ క్రమంలోనే 1988లో ఇండియాకు తిరిగొచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించారు. దీన్ని తమిళనాడు అంతటా విస్తరిస్తూ... కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా విస్తరించారు.

ఈ క్రమంలోనే నేపాల్, భూటాన్ లలో కూడా లాటరీ స్కీములు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా, హోటల్ ఇండస్ట్రీ, టెక్స్ టైల్స్ బిజినెస్ లలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే భారతదేశంలో లాటరీ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు పనిచేసే సంస్థగా పేరున్న... ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు మార్టిన్.

ఈ నేపథ్యంలో మార్టిన్ నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రపంచ లాటరీ అసోసియేషన్ లో సభ్యత్వం కూడా ఉంది. ఇది ఆన్ లైన్ గేమింగ్ తో పాటు క్యాసినో లను కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనను లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చిన కంపెనీగా నిలిచింది!

ఇదే సమయంలో మార్టిన్‌ పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా... భూ ఆక్రమణలు, చీటింగ్ వంటి ఆరోపణలతో ఆయనపై 2011లో కోయంబత్తూర్‌ లో కేసులు నమోదయ్యాయి! మరోపక్క ఈ కంపెనీపై పలు మార్లు దాడులు చేసిన ఈడీ.. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. సీబీఐ కూడా పలు కేసులు నమోదు చేసింది.

అంబానీ, అదానీ, టాట లు లేని జాబితా!:

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చిన జాబితాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ బహిర్గతం చేసిన నేపథ్యంలో... ఆ జాబితాలో టాప్ బిజినెస్ మెన్ పేర్లు లేకపోవడం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చినవారి జాబితాలో అంబానీ, అదానీ, టాటా ల పేర్లు కనిపించలేదు.

ఈ సమయంలో రాజకీయాలతో పెద్దగా టచ్ లో ఉన్నట్లు కనిపించని టాటా సంగతి కాసేపు పక్కనపెడితే... అంబానీ, అదానీల పేర్లు కూడా కనిపించకపోవడంపై ఆసక్తికరమైన చర్చ మొదలైందని తెలుస్తుంది. కాగా... కేంద్రంలోని బీజేపీతో అంబానీ, అదానీలకు మాంచి సంబంధాలున్నాయని రాజకీయవర్గాల్లో నిత్యం ఏదో ఒక మూల మాటలు వినిపిస్తుంటున్న సంగతి తెలిసిందే.