నిప్పురవ్వే.. కార్చిచ్చుగా మారి.. లాస్ ఏంజెలెస్ రగిలిపోతోంది..
లాస్ ఏంజెలెస్ లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి.
By: Tupaki Desk | 9 Jun 2025 3:15 PM ISTఅందాల హాలీవుడ్.. అంతకుమించిన అందాల నగరం.. నిరసనలతో రగులుతోంది.. ఆందోళనలతో అట్టుడుకుతోంది.. నిప్పు రవ్వ కార్చిచ్చుగా మారింది.. ఇదంతా అమెరికా హాలీవుడ్ కేంద్రమైన లాస్ ఏంజెలెస్ పరిస్థితి. ఎప్పుడూ వేసవి కాలంలో అడవుల్లోని కార్చిచ్చుల కారణంగా వార్తల్లో నిలిచే లాస్ ఏంజెలెస్.. ఈసారి వలసదారుల ఆందోళనలతో అగ్ని గుండంగా మారింది. దాడులు కూడా జరుగుతుండడంతో రణరంగాన్ని తలపిస్తోంది. లాస్ ఏంజెలెస్ నగరం డౌన్ టౌన్ (ప్రధాన ప్రాంతం) లో ఇప్పటికే ప్రజలు గుమిగూడడంపై నిషేధం విధించారు.
పరిస్థితి చేయిదాటుతోందా..?
డౌన్ టౌన్ లోని ప్రధాన హైవేను ఆందోళనకారులు ఆధీనంలోకి తీసుకోవడం.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టడం.. చూస్తుంటే లాస్ ఏంజెలెస్ లో పరిస్థితి అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. జాతీయ రహదారిని అదుపులోకి తీసుకోవడంలో 2 వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. పోలీసులపై దొరికిన వస్తువులను విసిరేశారు. వారి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ రహదారి చాలా కీలకం అయినది.. అది ఎంతగా అంటే.. పసిఫిక్ మహా సముద్రం పక్కనుంచి 4 వేల కిలో మీటర్లు (1,500 వైళ్లు) ప్రయాణిస్తుంది.
లాస్ ఏంజెలెస్ లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో నేషనల్ గార్డ్స్ ను ట్రంప్ర్ ప్రభుత్వం రంగంలోకి దిపింది. మాస్కులు ధరించి ఉన్నవారిని అరెస్టు చేయమంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ఇటీవల ట్రంప్ తో విభేదిస్తున్న అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించగా.. లాస్ ఏంజెలెస్ గవర్నర్ కరెన్ బాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. శాంతియుత ఆందోళనలు కొనసాగేలా చూడాలని, ట్రంప్ ప్రభుత్వమే పరిస్థితులను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. నేషనల్ గార్డ్స్ ను దింపి ప్రజలను ఆందోళనకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. లాస్ ఏంజెలెస్ అనే గొప్ప నగరాన్ని అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించారు అనేది ట్రంప్ వాదన. దానికి వ్యతిరేకంగా ఆయన తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
