Begin typing your search above and press return to search.

రెండు నియోజకవర్గాల్లో లోకేశ్ పోటీ.. వచ్చేసింది క్లారిటీ!

ఇందులో భాగంగా ఈసారి బాలయ్యతో త్యాగం చేయించి.. హిందూపురం లాంటి సేఫెస్ట్ సీటుని లోకేష్ ఎంచుకునే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:28 AM GMT
రెండు నియోజకవర్గాల్లో లోకేశ్  పోటీ.. వచ్చేసింది క్లారిటీ!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఈసారి జనసేనతో కలిసి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... టీడీపీకి సీట్ల సర్ధుబాటు అతిపెద్ద సమస్యగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... గత ఎన్నికల్లో ఓటమిపాలైన నారా లోకేష్ ఈ దఫా రిస్క్ చేయదలుచుకోవడం లేదని, ఇందులో భాగంగా ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారని కథనాలొస్తున్నాయి.

అవును... గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేశారు. అప్పటికే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రాబోయే ఎన్నికల్లో లోకేష్ సీటు మారుస్తారనే కామెంట్లు వినిపించాయి.

ఇందులో భాగంగా ఈసారి బాలయ్యతో త్యాగం చేయించి.. హిందూపురం లాంటి సేఫెస్ట్ సీటుని లోకేష్ ఎంచుకునే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి. ఇదే సమయంలో... గతంలో మంగళగిరి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... మంగళగిరి లో కూడా పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేనతో పొత్తు నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్ అని, ఆ ఒక్కారూ ఎవరో వారే డిసైడ్ చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో నారా వారి ఇంట్లో కనీసం ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వాలి. ఇందులో భాగంగా చంద్రబాబు ఈసారి కూడా కుప్పం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో... లోకేష్ కు మంగళగిరి టిక్కెట్ ఇవ్వాలి. దీంతో ఇప్పటికే ఇద్దరికి టిక్కెట్లు ఇస్తున్న నేపథ్యంలో... లోకేష్ కి మరో టిక్కెట్ కష్టం అనే కామెంట్లు వినిపించాయి! ఇది పార్టీలో, ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు పంపే ప్రమాధం ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా తాను రెండు స్థానాల్లో పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా మంగళిగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని.. తాను రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మార్చే ప్రస్తకే లేదని.. ఈ ఒక్క చోటే తాను పోటీ చేస్తానని బలంగా చెప్పారు. ఈ విషయంలో వస్తున్న ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు నమ్మొద్దని తెలిపారు.

కాగా... గత కొన్ని రోజులుగా... రాబోయే ఎన్నికల్లో సేఫ్ సైడ్ గా నారా లోకేష్ రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అవి గాసిప్స్ మాత్రమే అని, ఆ ప్రచారాల ట్రాప్ లో పడొద్దంటూ కార్యకర్తలకు తెలిపారు లోకేష్.