Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి బ్రాహ్మణి... లోకేష్ కండిషన్స్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాలుగు రోజుల అనంతరం చినబాబు లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2023 5:33 AM GMT
రాజకీయాల్లోకి బ్రాహ్మణి... లోకేష్  కండిషన్స్?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాలుగు రోజుల అనంతరం చినబాబు లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన హస్తినలోనే ఉన్నారు. ఈలోపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ కేసులో ఆయనకు ఏపీసీ ఐడీ 41-ఏ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 4న విచారణకు హాజరుకానున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం హస్తినలోనే ఉన్న నారా లోకేష్.. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు, తదినంతర పరిణామాలు, బ్రాహ్మణి రాజకీయ రంగప్రవేశం మొదలైన విషయాలపై సవివరంగా స్పందించారు. ఈ సమయంలో... రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని చూడగానే ఒక్కసారిగా షేక్‌ అయ్యానని లోకేష్ తెలిపారు.

అనంతరం... హెరిటేజ్‌ వ్యాపార వృద్ధికి తాము తీసుకొనే ఎన్నో నిర్ణయాలకు ఆయన బ్రేక్‌ లు వేశారని చెప్పిన లోకేష్... చంద్రబాబు కారణంగానే హెరిటేజ్‌ గ్రోత్‌ నిదానంగా జరిగిందని, లేదంటే ఇప్పటికే మూడురెట్లు పెరిగేదని చెప్పడం గమనార్హం. ఇక తమకు ఐటీ కంపెనీలు ఏమీ లేవని, సైబరాబాద్‌ లో ఒక్క ఎకరం భూమి కూడా లేదని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఇక తన విషయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని చెప్పిన లోకేష్... సెక్షన్‌ 17ఎ కింద మాజీ మంత్రిని పిలవడానికి డీజీపీ స్థాయి ర్యాంకు అధికారికి తప్ప ఏఎస్పీ కి వీల్లేదని అన్నారు. ఫలితంగా తన విషయంలో కూడా సీఐడీ రూల్స్ పాటించలేదని తెలిపారు. ఇదే సమయంలో... సీఐడీ తనను ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్ కేసులోనే పిలిచింది కాబట్టి, దానిపైనే విచారించాలని.. అక్కడికెళ్లాక ఇంకో కేసులో విచారిస్తామంటే కుదరదని అన్నారు.

తనకు సీఐడీ ఇచ్చిన 41-ఏ నోటీసుల్లో పేర్కొన్న విధంగా అకౌంట్ పుస్తకాలు, ఫైనాన్షియల్ వ్య్యవహారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని తెలిపారని... అయితే తానిప్పుడు హెరిటేజ్ బోర్డ్ మెంబర్స్ లిస్ట్ లో లేనని అన్నారు. అయినప్పటికీ సీఐడీ నోటీసులో పేర్కొన్న వివరాలు ఇవ్వాలంటూ హెరిటేజ్‌ కార్యదర్శికి మెయిల్‌ పంపినట్లు లోకేష్ తెలిపారు.

ఇదే క్రమంలో... చంద్రబాబుకు బెయిల్ రాకపోతే, లోకేష్ లోపలికి వెళ్లడం తప్పకపోతే.. నారా బ్రాహ్మణే టీడీపీ బాధ్యతలు తీసుకుంటారని కథనాలు వస్తున్న నేపథ్యంలో... ఆమె రాజకీయ రంగ ప్రవేశంపైనా స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయాళంటే బ్రాహ్మణికి ఆసక్తి లేదని, ఒకవేళ ఆమె రావాలనుకుంటే ఆమె ఇష్టం అని లోకేష్ స్పష్టం చేశారు.

కాగా... కోర్టులోని పరిణామాలను బట్టి నారా భువనేశ్వరి ఈ నెల 5న కుప్పం నుంచి బస్సు యాత్రకు బయలుదేరబోతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో నారా బ్రాహ్మణి కూడా ఆమెతో ఉంటారా.. లేక, రాజమండ్రిలోనే ఉండి పార్టీని సమన్వయ పరుస్తూ, పెద్దలతో సమాలోచనలు చేస్తూ ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి!