Begin typing your search above and press return to search.

బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పిన లోకేష్

బాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు ఆయన విజన్ వేరే లెవెల్ అనేవారు. ఐటీ బాబు అని చెప్పేవారు.

By:  Tupaki Desk   |   30 May 2025 8:30 AM IST
బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పిన లోకేష్
X

తన తండ్రి ఒక దిగ్గజ నేత అని నారా లోకేష్ కి తెలుసు. ఆయన అపర చాణక్యుడు అని కూడా తెలుసు. అంతే కాదు దార్శనీకుడు అని బాగా తెలుసు. ఆ ఇంటి నుంచి మొలిచిన మొక్కగా తండ్రి కంటే లోకేష్ కి అతి పెద్ద అభిమాన నాయకుడు వేరేవరూ ఉండే చాన్సే లేదు. చంద్రబాబుని చూస్తూ పెరిగిన లోకేష్ ఆయన అడుగు జాడలలోనే టఫ్ ఫీల్డ్ అయినా పాలిటిక్స్ నే ఎంచుకున్నారు.

రాజకీయ రంగంలో తండ్రిని మించాలని కాదు తండ్రి మెచ్చాలన్న తపనతోనే లోకేష్ తన పాలిటిక్స్ ని ధీటుగా సాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆయన ప్రతీ రోజూ అనేక పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక చంద్రబాబుని అనేక మంది నాయకులు బాగా పొగుడుతారు. వారి కోణంలో బాబు ఎన్నో విధాలుగా కనిపిస్తారు.

మరి ఆ తండ్రి బిడ్డగా లోకేష్ కి బాబు ఎలా కనిపిస్తారు. ఆయన పాలన కానీ ఆయన రాజకీయ నాయకత్వం కానీ ఎలా లోకేష్ కి అనిపిస్తుంది అంటే కడపలో జరిగిన మహానాడులో లోకేష్ చేసిన ఉపన్యాసంలో అది కళ్ళకు కట్టింది. తండ్రి చంద్రబాబుని ఎన్నో సార్లు లోకేష్ ఏపీకి ఆయనే అతి పెద్ద ఐకాన్ అని అభివర్ణించారు ఏపీకి వేరే బ్రాండ్ అవసరం లేదు, ఒక్క చంద్రబాబు మాకు చాలు అని గర్వంగా చెప్పుకొచ్చారు.

ఒక విధంగా ఆ మాటను ఏ నేతా అనలేదు, బాబుని అలా ఎవరూ ఆ కోణంలో నుంచి పొగడడలేదు. అలా కొత్తగా బాబుని చూసిన ఘనత లోకేష్ దే. అయితే కడప సభలో దానిని మించి అన్నట్లుగా చంద్రబాబు గురించి మూడు ముక్కలలో లోకేష్ స్పష్టంగా చెప్పేశారు.

అది మొత్తం బాబు పదిహేనేళ్ళ పాలన మీద కూడా కచ్చితమైన భావనగా ఉంది. బాబు అంటే ఆనాడు ఐటీ మరి నేడు ఏఐ బాబు అంటే ఆనాడు హైటెక్ సిటీ మరి నేడు క్వాంటం వాలీ, బాబు అంటే ఆనాడు సైబరాబాద్, మరి నేడు అమరావతి అని లోకేష్ చాలా సింపుల్ గా ఎంతో అర్ధవంతంగా అందరినీ బోధపడేటట్లుగా చెప్పేశారు.

బాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు ఆయన విజన్ వేరే లెవెల్ అనేవారు. ఐటీ బాబు అని చెప్పేవారు. సైబరాబాద్ హైటెక్ సిటీ బాబుకు విశేషణాలుగా ఉండేవి. ఇపుడు ఏపీలో బాబు అంటే ఏమిటన్నవి చెబుతూ బాబుతోనే ఏపీ అభివృద్ధి అని లోకేష్ స్పష్టం చేశారు.

నిన్నటి హైటెక్ సిటీ సైబరాబాద్ లను చూడండి, ఐటీని చూడండి, మరి నేటి ఏఐ, క్వాంటం వాలీ అమరావతిలతో బాబు ఏపీని ఎక్కడితో తీసుకుని పోతారు అని లోకేష్ ఒట్టేసినట్లుగా జనాలకు చెప్పారు. మరి ఈ మూడు ముక్కలూ చాలుగా బాబు ఏంటో చెప్పడానికి అని అంతా అంటున్నారు. అంతే కాదు ఏపీకి బాబు అవసరం ఏంత ఏమిటన్నది చెప్పడానికి కూడా ఇవే చాలు కదా అంటున్నారు. మొత్తానికి లోకేష్ తన స్పీచ్ తో బాబు విజన్ ఎలాంటిదో ఏపీ జనాలకు ఫుల్ క్లారిటీతో చెప్పేశారు.