నారా లోకేష్.. ఒక ఫ్యామిలీ మ్యాన్.. మంచి తండ్రి కూడా..
నారా లోకేష్.. ఒక యువ నాయకుడిగా, ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఇప్పటికే తన సత్తా చాటిన వ్యక్తి.
By: A.N.Kumar | 2 Aug 2025 2:17 PM ISTనారా లోకేష్.. ఒక యువ నాయకుడిగా, ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఇప్పటికే తన సత్తా చాటిన వ్యక్తి. ఇప్పుడు మరో ప్రాముఖ్యతను పొందుతున్న పాత్రలోనూ తన గొప్పదనాన్ని చాటుకున్నారు. ఒక ఫ్యామిలీ మ్యాన్, మంచి తండ్రిగా నిరూపించుకుంటన్నాడు. .
తన తండ్రి పాత్రను మెరుగ్గా నిర్వర్తిస్తూ.. శనివారం తన కొడుకు దేవాన్ష్ పాఠశాల నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్‌కు (PTM) హాజరయ్యారు. ప్రజాజీవితంలో నిరంతరం బిజీగా ఉండే లోకేష్.. ఒక రోజు విశ్రాంతి తీసుకొని కుటుంబానికి సమయం కేటాయించడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ సందర్భాన్ని ఓ తీపి జ్ఞాపకంగా నిలుపుకుంటూ.. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఓ ఫొటో షేర్ చేశారు. అందులో లోకేష్, బ్రాహ్మణి , దేవాన్ష్ కలిసి కనిపిస్తూ హాయిగా నవ్వుతూ ఉన్నారు.
“ఇవాళ దేవాన్ష్ పీటీఎంకి వెళ్ళడానికి ఒక రోజు సెలవు తీసుకున్నా. ప్రజాజీవితానికి కాస్త విరామం ఇచ్చాను. అందుకే ఇలా కుటుంబంతో గడిపే ముచ్చటైన క్షణాలు మరింత ప్రత్యేకంగా అనిపిస్తాయి. దేవాన్ష్ ప్రపంచం, అతని చిన్న కథలు, చిరునవ్వు.. తండ్రిగా ఉండడాన్ని మాయాజాలంలా అనిపింపజేస్తాయి. మేము నిన్ను గర్విస్తున్నాం దేవాన్ష్!” అని లోకేష్ తన పోస్ట్‌లో రాసుకున్నారు.
గతంలో ఒకసారి లోకేష్ మాట్లాడుతూ.. “నా పీటీఎంలకు నాన్న చంద్రబాబుగారు ఎప్పుడూ రాలేదు. నాన్న బిజీగా ఉండేవారు. అందుకే అమ్మ భువనేశ్వరి మాత్రమే హాజరయ్యేవారు” అని వెల్లడించారు. ఇప్పుడు అదే పరిస్థితి లోకేష్‌కు ఎదురవుతోంది. ప్రస్తుతం తన కొడుకు దేవాన్ష్ పీటీఎంలకు బ్రాహ్మణి హాజరవుతూ వస్తున్నారు.
అయితే ఈసారి దేవాన్ష్‌కు ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ లోకేష్ స్వయంగా పీటీఎంకు హాజరై అతనితో మధుర క్షణాలను గడిపారు. ఇది ఒక సామాన్యమైన సంఘటనగా అనిపించొచ్చు కానీ.. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు కుటుంబానికి ఎంత విలువనిస్తారు అనేదానికి ఇదొక స్ఫూర్తిదాయక ఉదాహరణ.
తండ్రిగా, భర్తగా, నాయకుడిగా.. మూడు పాత్రల మధ్య సమతౌల్యం సాధించడంలో లోకేష్ చూపించిన చిత్తశుద్ధి ఇప్పుడు చాలామందికి ప్రేరణగా మారుతోంది.
