Begin typing your search above and press return to search.

ప్ర‌ధాన మంత్రి కూడా నోటీసులు ఇవ్వాల్సిందే: ఓం బిర్లా

పార్ల‌మెంటులో మాట్లాడేందుకు కొన్ని నియ‌మ, నిబంధ‌న‌లు ఉంటాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.

By:  Garuda Media   |   12 March 2026 5:00 PM IST
ప్ర‌ధాన మంత్రి కూడా నోటీసులు ఇవ్వాల్సిందే:  ఓం బిర్లా
X

పార్ల‌మెంటులో మాట్లాడేందుకు కొన్ని నియ‌మ, నిబంధ‌న‌లు ఉంటాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. ఈ నిబంధ‌న‌ల మేరకే ఎవ‌రైనా లోక్‌స‌భ‌లో మాట్లాడాల్సి ఉంటుంద‌న్నారు. ఎవ‌రూ నిబంధ‌న‌ల‌కు అతీతులు కార‌ని తేల్చి చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. చివ‌ర‌కు ప్ర‌ధాన మం త్రి అయినా.. స‌భ‌లో మాట్లాడాల‌ని అనుకుంటే స్పీక‌ర్‌కు నోటీసులు ఇచ్చి.. తీరాల్సిందేన‌ని చెప్పారు. త‌న‌కు ఎలాంటి ప‌క్ష‌పాతం లేద‌న్నారు.

అంతేకాదు.. ఎవ‌రు మాట్లాడాలో నిర్ణ‌యించేది కూడా తాను కాద‌ని.. నియ‌మ‌నిబంధ‌న‌లేన‌ని చెప్పారు. దీనిలో ప్ర‌తిపక్షాల‌కు ఒక నియ‌మం.. అధికార ప‌క్షానికి మ‌రోనియ‌మం అంటూ ఏమీ ఉండ‌బోద‌ని తెలిపా రు. త‌ను కూడా రూల్స్ ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌ని.. అవే నిబంధ‌న‌లు చెబుతున్నాయ‌న్నారు. మైకు ఆన్ ఆఫ్ బ‌ట‌న్లు కూడా త‌న చేతిలో ఉండ‌బోవ‌న్నారు. ఇవ‌న్నీ.. తెలిసి కూడా ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టాయ‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఇవి వారికి ఉన్న‌హ‌క్కుగానే తాను చూస్తాన‌న్నారు.

స‌భ‌లో ఎవ‌రికి ఎంత స‌మ‌యం ఇవ్వాల‌న్న‌ది ఆయా అంశాల ఆధారంగా ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. ఒక‌రికి ఎక్కువ‌.. ఒకరికి త‌క్కువ స‌మ‌యం ఇచ్చార‌న్న వాద‌న స‌రికాద‌ని తెలిపారు. రాహుల్‌గాంధీకి త‌గిన స‌మ‌యం ఇవ్వ‌బ‌ట్టే.. ఆయ‌న అధికార ప‌క్షాన్ని నిల‌దీసే అవ‌కాశం ఏర్ప‌డింద‌న్న విష‌యాన్ని తాను చెప్పాల్సి వ‌స్తోంద‌న్నారు. స్పీక‌ర్‌గా ప‌క్ష‌పాతం చూపించి ఉంటే.. రాహుల్‌కు స‌మ‌యం ద‌క్కేదా? అలా చూపాల‌ని తాను అనుకోన‌ని.. ఏదైనా స‌భ నియ‌మాల‌ను అనుసూరించే న‌డుస్తున్నాన‌న్నారు.

స‌భ‌లో అంద‌రూ మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు స్పీక‌ర్ బిర్లా చెప్పారు. ప్ర‌ధాన మంత్రి నుంచి సాధార‌ణ ఎంపీ వ‌ర‌కు అంద‌రికీ ఒకే త‌ర‌హా నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. ఒక‌రు ఎక్కువ‌, మ‌రొక‌రు తక్కువ అనేది కూడా లేద‌న్నారు. కాగా.. స్పీక‌ర్ ఓం బిర్లా ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. విప‌క్ష స‌భ్యులు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై 10 గంట‌ల పాటు జ‌రిగిన చ‌ర్చ అనంత‌రం.. ఓటింగ్ నిర్వ‌హించారు. దీనిలో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో ఆయ‌న తిరిగి స‌భ‌కు వ‌చ్చారు.