Begin typing your search above and press return to search.

ఏటా పిడుగుపాటుతో ఎన్ని కోట్ల చెట్లు చనిపోతాయో తెలుసా?

ఈ సందర్భంగా స్పందించిన అధ్యయనం ప్రధాన రచయిత ఆండ్రియాస్ క్రాస్.. తాము ఇప్పుడు ఏటా పిడుగుపాటు వల్ల ఎన్ని చెట్లు చనిపోతాయో అంచనా వేయడమే కాకుండా.

By:  Tupaki Desk   |   25 July 2025 8:15 AM IST
ఏటా పిడుగుపాటుతో ఎన్ని కోట్ల చెట్లు చనిపోతాయో తెలుసా?
X

వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది మనుషులు, చాలా పశువులు పిడుగుపాటుకు బలైపోయిన వార్తలు కనిపిస్తుంటానే సంగతి తెలిసిందే! అయితే ఇటీవల కాలంలో... విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక మెసేజ్ లు వస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఉండాలని చెబుతుంటారు.

అయినప్పటికీ పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలూ అప్పుడప్పుడూ వర్షానికి చెట్ల కింద తలదాచుకున్న సమయంలో పిడుగుపాటుకు బలైపోతుంటారు. ఇదే సమయంలో.. పిడుగు పాటుకు కాలిపోతున్న చెట్లకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే.. ఇలా పిడుగుపాటు వల్ల ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల చెట్లు చనిపోతాయనే విషయం తెలుసా?

అవును... ప్రపంచవ్యాప్తంగా చెట్లపై పిడుగులు పడటం వల్ల ఎంత నష్టం జరుగుతుందనే విషయంపై ఓ కొత్త అధ్యయనం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ (టీయూఎం) పరిశోధకుల అధ్యయనం ప్రకారం... ప్రత్యక్ష పిడుగుపాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 320 మిలియన్ల (32 కోట్ల) చెట్లు చనిపోతున్నాయి.

ఈ సందర్భంగా... గ్లోబల్ వెజిటేషనరీ మోడల్‌ లో గ్లోబల్ మెరుపు నమూనాలతో పరిశీలనా డేటాను అనుసంధానించడం ద్వారా.. చనిపోయిన చెట్ల సంఖ్యను పరిశోధకులు అంచనా వేయగలిగారని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలను కూడా గుర్తించగలిగారని.. కార్బన్ నిల్వపై పరిణామాలను అంచనా వేయగలిగారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అధ్యయనం ప్రధాన రచయిత ఆండ్రియాస్ క్రాస్.. తాము ఇప్పుడు ఏటా పిడుగుపాటు వల్ల ఎన్ని చెట్లు చనిపోతాయో అంచనా వేయడమే కాకుండా.. ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలను గుర్తించి, ప్రపంచ కార్బన్ నిల్వ, అటవీ నిర్మాణంపై దాని ప్రభావాలను అంచనా వేయగలుగుతున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా... ఏటా పిడుగుపాటు కారణంగా చనిపోతున్న 32 కోట్ల చెట్లు మొత్తం.. మొక్కల బయోమాస్ నష్టంలో 2.1 నుండి 2.9 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... చనిపోయిన చెట్లు కుళ్ళిపోవడంతో 0.77 - 1.09 బిలియన్ టన్నుల కార్బన్ డైఅక్సైడ్ విడుదలవుతుందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. ఈ అధ్యయనం నష్టాన్ని కొలవడానికి చేసిన మొదటి తీవ్రమైన ప్రయత్నాన్ని సూచిస్తుందని.. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు మనం అడవులను ఎలా మోడల్ చేయాలో పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఇది గుర్తు చేస్తుందని అంటున్నారు.