Begin typing your search above and press return to search.

రూ.600 కోట్లు వదిలేసి సన్యాసిగా మారాడు!

తాజాగా ఒక బిలియనీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   17 July 2023 1:46 PM GMT
రూ.600 కోట్లు వదిలేసి సన్యాసిగా మారాడు!
X

తాజాగా ఒక బిలియనీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కష్టపడి సంపాదించుకున్న యావదాస్తిని వదిలేసుకున్నారట. మత బోధకుడిగా మారాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్తి రూ.600 కోట్ల అంశం తెరపైకి వచ్చింది.

అవును... సాధారణంగా పేదరికం నుంచి సంపన్న జీవులుగా మారాలని చాలామంది కలలు కంటుంటారు. సంపన్న జీవితం వదిలి సన్యాసిగా బతకాలని నూటికో కోటికో ఎవరో ఒకరు అలా అనుకుంటారేమో. అయితే తాజాగా "భన్వర్‌ లాల్ రఘునాథ్ దోషి" ఆ కోవలోకే వస్తారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్‌ లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి రూ.30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం ప్రారంభించాడట భన్వర్‌ లాల్‌. ఈ వ్యాపారం కొద్ది కాలంలోనే గణనీయంగా వృద్ధి సాధించిందట. ఈ నేపథ్యంలో సుమారు రూ.600 కోట్లకు తన వ్యాపారాన్ని విస్తరించుకోగలిగారని తెలుస్తుంది. దీంతో... ఢిల్లీ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడంట భన్వర్ లాల్.

అయితే తాజాగా ఆయన జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరిక కలిగిందంట. దీంతో అనుకున్నదే తడవుగా... అహ్మదాబాద్‌ లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ... భన్వర్ లాల్ ని సత్కరించారట.

అయితే ఎప్పటినుంచో సన్యాసి కావాలని అనుకుంటున్న భన్వర్ లాల్.. అప్పటి కుటుంబం పరిస్థితులు, వ్యాపార లావాదేవీల వల్ల తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశారట. అయితే తాజాగా భాధ్యతలు అన్ని పూర్తిచేసుకుని, జీవితంలో అనుకున్నవన్నీ సాధించిన అనంతరం తాజాగా జైనమంతం స్వీకరించారంట.

యితే ఈ వేడుక 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో వైభవంగా జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తనకున్న కోట్ల సామ్రాజ్యాన్ని త్యజించాలని నిర్ణయించుకోవడం ఎంతోమందికి ఆదర్శనీయం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... రూ.600 కోట్లను త్యజించాలంటే అది మామూలు విషయం కాదని అభిప్రాయపడుతున్నారట!