కోడలికి రూ.2200 కోట్ల కానుకల్ని ఇచ్చిన మామ
ఆసియా వారెన్ బఫెట్ గా పేరు ప్రఖ్యాతులున్న దివంగత లీ షావ్ కీకి సంబంధించిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. హాంకాంగ్ లోనే రెండో అత్యంత సంపన్నుడిగా పేరున్న ఆయన.. తన కోడలికి ఇచ్చిన కానుకల జాబితా బయటకు వచ్చి అందరూ వావ్ అనేలా మారింది.
By: Tupaki Desk | 23 May 2025 10:08 AM ISTఆసియా వారెన్ బఫెట్ గా పేరు ప్రఖ్యాతులున్న దివంగత లీ షావ్ కీకి సంబంధించిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. హాంకాంగ్ లోనే రెండో అత్యంత సంపన్నుడిగా పేరున్న ఆయన.. తన కోడలికి ఇచ్చిన కానుకల జాబితా బయటకు వచ్చి అందరూ వావ్ అనేలా మారింది. కోడలికి ఈ మామ ఇచ్చిన కానులక విలువ దగ్గర దగ్గర రూ.2200 కోట్లకు పైనే అని చెబుతున్నారు. రియల్ ఎస్టేట టైకూన్ గా పేరున్న ఆయన.. హెండర్సన్ ల్యాండ్ డెవలప్ మెంట్ సంస్థలో మెజార్టీ వాటాదారు. ఈ ఏడాది మార్చి 17న ఆయన తన 97 ఏళ్ల వయసులో మరణించారు.
ఇక.. ఆయన కోడలు కేతీ చుయి విషయానికి వస్తే.. ఆమె హాంకాంగ్ వాసులకు సుపరిచితులురాలు. కారణం.. ఆమె సినీ నటి కావటమే కాదు సామాజిక కార్యకర్త కూడా. పెద్ద ఎత్తున సాయం చేస్తూ అందరి మనసుల్ని దోచుకుంటూ ఉంటారు. మరోసారి దివంగత లీ షావ్ కీ విషయానికి వస్తే.. ఆయన మరణించే నాటికి ఆయన ఆస్తి 29.2 బిలియన్ డాలర్లుగా బ్లూమ్ బర్గ్ అంచనా. ఆయనకు ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుళ్లు. పెద్ద కొడుకు పీటర్ కు ముగ్గురు సంతానం. అయితే..వారంతా సరోగసీ ద్వారా పుట్టినట్లు చెబుతారు.
చిన్నకొడుకు అదే సినీ నటి కేతీ చుయి భర్త మార్టిన్. ఈ జంటకు 2006లో పెళ్లి జరిగింది. ఈ జంటకు నలుగురు సంతానం. పెళ్లికి ముందు వరకు సినీ నటిగా ఉన్నప్పటికీ.. పెళ్లి తర్వాత మాత్రం సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. మరింత గుర్తింపు పొందారు. దాన ధర్మాల్లో ఆమె ఒక మార్గదర్శిగా చెబుతారు. ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు బోలెడన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. లీ షావ్ కీ మరణించే వరకు తన కోడలికి తరచూ ఖరీదైన కానుకల్ని ఇచ్చేవారు. ఆమెకు ఇచ్చిన కానుకల్లో ఒక యాచ్.. విలాసవంతమైన భవనంతో పాటు.. ఆమె నలుగురు పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ ఫండ్.. మిలియన్ డాలర్ల విలువైన భూమిని ఇచ్చినట్లుగా చెబుతారు. ఆమెకు కలిగే ప్రతి సంతానానికి విలువైన కానుకల్ని ఇచ్చేవారన్న విషయం బయటకు వచ్చింది. 2015లో ఆమెకు చివరగా నాలుగో సంతానం పుట్టిన వేళలోనే ఆమెకు ఖరీదైన కానుల్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ కోడలని హాంకాంగ్ మీడియాలో హాండ్రెడ్ బిలియన్ డాటర్ ఇన్ లాగా మార్మోమోగుతుంది. ఏమైనా ప్రపంచంలో ఇంతటి లక్కీ కోడలు మరెవరూ ఉండరేమో?
