Begin typing your search above and press return to search.

మరో కబడ్డీ ప్లేయర్ ను చంపిన బిష్ణోయ్ గ్యాంగ్.. కారణాలు ఇవేనట..

ఇందులో భాగంగా పంజాబ్ కు చెందిన గుర్విందర్ సింగ్ ను హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   5 Nov 2025 3:19 PM IST
మరో కబడ్డీ ప్లేయర్ ను చంపిన బిష్ణోయ్ గ్యాంగ్.. కారణాలు ఇవేనట..
X

బిష్ణోయ్ లారెన్స్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. డాన్ గా మారిన లారెన్స్ ఒక గ్యాంగ్ ను నడుపుతున్నాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. సల్మాన్ ఖాన్ ను చంపుతామని ప్రకటించని బిష్ణోయ్ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. తమ ఇష్టదైవమైన జంతువును చంపి తినడమే కారణం అంటూ చెప్పి బాలీవుడ్ ను హీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల కబడ్డీ ప్లేయర్లను హత్య చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా పంజాబ్ కు చెందిన గుర్విందర్ సింగ్ ను హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

కబడ్డీ మనదేశానికి సంబంధించి అతి ఇష్టమైన క్రీడ. పల్లె నుంచి నగరాల వరకు ఈ ఆట యువతను ఆకర్షిస్తుంది. కానీ పదేళ్ల వ్యవధిలోనే 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య కొంత కలవారానికి గురి చేసింది. బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ ఈ హత్యతో కలిసి పది మందిని హతమార్చారు. దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గ్యాంగ్ ఈ పది మంది నేరాలు చేశారు కాబట్టే చంపామని చెప్పడం కొసమెరుపు.

గుర్వింద్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఇది ఎవరి పని అని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బిష్ణోయ్ గ్యాంగ్ ఇది తమ పనేనని చెప్పుకచ్చింది. గ్యాంగ్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌లో ఈ హత్యను తమ శత్రువులకు హెచ్చరికగా చూపించి, ‘మీ దారులు మార్చుకోకపోతే బుల్లెట్‌ దించుతాం’ వంటి సందేశం పంపించారు. ఇలాంటి వారి మధ్య నిందితుల కోసం పోలీసుల గాలింపు జరుగుతోంది. ఆటగాళ్లకు, వారి కుటుంబాలకు, క్రీడా రంగానికి ఎదురయ్యే భయాన్ని పెంచుతోంది.

2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌ తో సంబంధం ఉండే ప్లేయర్లే ఎక్కువగా హత్యలకు గురవడం గమనార్హం. ఇది ప్లేయర్ల వ్యక్తి గత తప్పు అయినా.., సమష్టిగా చూస్తే క్రీడా వ్యవస్థలో స్థానిక సమాజాలలో ఆర్థిక వాతావరణంలో ఉన్న లోపాలు చూపిస్తుంది. నైపుణ్యానికి బదులుగా మోహనాలు, ఆటలో తిరుగులేని ఆర్థిక బలహీనతలు.., ఉపాధి అవకాశాల లోపం.. ఇవన్నీ యువతను విపరీత మార్గాలకు తీసుకెళ్తుంది.

క్రీడా నియమావళి, సంఘాల నిర్ణయాలు, స్థానిక అధికారులు, పోలీసుల బాధ్యత ఈ సందర్భంలో సున్నితమైంవి. ఆటగాళ్లను పరిపూర్ణమైన పునరావృత శిక్షణ అవకాశాలు, వ్యవ‌స్థాత్మక రికవరీ, మానసిక సపోర్ట్ కల్పించడం ద్వారా మాత్రమే ఇలాంటి నేరాలను నివారించగలం. డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్‌ ప్రవర్తనతో అనుసంధానమైతే ఆ వైపున కఠిన విచారణలు, సమర్ధ నియంత్రణలు అవసరం.

ఇక్కడ మరో ప్రశ్న కనిపిస్తుంది. క్రీడా సంస్థలు, ఫెడరేషన్లు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాయి? ప్లేయర్ల కోసం మార్గాలు, యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి, డ్రగ్-టెస్టింగ్ విధులు వంటి ప్రాథమిక తనిఖీలు ఉన్నాయా? సామాజిక సేవా సంఘాలు, స్థానిక యూత్ క్లబ్‌లు ఇవే సమస్యలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తాయా? లేదంటే, ఒక డ్రైవ్‌లో జరిగిన ఘటన ఒక పెద్ద సంకేతంగా మారి పోతుంది.