Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులకు తాజా హెచ్చరిక!

ఈ మేరకు.. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ (డీ.ఎం.హెచ్.ఓ) లకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Desk   |   27 April 2024 4:46 AM GMT
ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులకు తాజా హెచ్చరిక!
X

ఏపీ ప్రైవేటు ఆసుపత్రులకు తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి! ఈ మేరకు.. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ (డీ.ఎం.హెచ్.ఓ) లకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా... సిజేరియన్ ప్రసవాలు అధికంగా చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో సిజేరియన్ లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని తెలిపారు.

అవును... నెలలు నిండిన మహిళ నొప్పులంటూ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం... సిజేరియన్ అనేది ఫస్ట్ ఆప్షన్ గా పెడుతున్నారనే విమర్శ ఉంది! పైగా ఇటీవల కాలంలో ముహూర్తం ఫిక్స్ చేసి మరీ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారని.. ఫలితంగా పుట్టిన బిడ్డ అదృష్ట జాతకులు అవుతారని పలువురు తల్లితండ్రులు నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇంతకు మించిన అజ్ఞానం ఉంటుందా అంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి పక్కనపెడితే... ఇప్పుడు ఈ ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి.

వాస్తవానికి వైద్యులు మాగ్జిమం నార్మల్ డెలివరీకి ప్రయత్నించాలని.. ఇదే సమయంలో మహిళ గర్భవతి అయినప్పటి నుంచీ ఆమెకు ఈ మేరకు పాటించాల్సిన పద్దతుల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని అంటుంటారు. అయితే... వైద్యులు ఆ పనిచేయడం లేదనే విమర్శ కూడా ఉంది! ఇదే సమయంలో గర్భవతులైన మహిళల్లో కొంతమందికి నార్మల్ డెలివరీలకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన లేదని కూడా అంటుంటారు.

ఈ విషయాలను అదనుగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు సిజేరియన్ల పేరిట చెలరేగిపోతున్నాయనే విమర్శ సమాజంలో ఉంది! దీంతో... మహిళలకు డెలివరీ అనంతరం అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో... ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వెంకటేశ్వర్... సిజేరియన్ ప్రసవాలు అధికంగా చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఆసక్తిగా మారింది!