Begin typing your search above and press return to search.

బీర్ ఎంచక్కా తాగేయొచ్చు.. తాజా అధ్యయనం ఏం చెప్పింది?

చిల్ బీర్ అన్నంతనే గొంతులో కొత్త అలజడి మొదలు కావటమే కాదు.. ఆ పని ఎప్పుడు పూర్తి చేద్దామా?

By:  Tupaki Desk   |   8 Sep 2023 4:20 AM GMT
బీర్ ఎంచక్కా తాగేయొచ్చు.. తాజా అధ్యయనం ఏం చెప్పింది?
X

చిల్ బీర్ అన్నంతనే గొంతులో కొత్త అలజడి మొదలు కావటమే కాదు.. ఆ పని ఎప్పుడు పూర్తి చేద్దామా? అంటూ ఆసక్తిగా ఎదురుచూసే వారికి కొదవ ఉండదు. అయితే.. బీర్ తాగటాన్ని తప్పుగా చూసే వారు చాలా మందే కనిపిస్తారు. అయితే.. తాజాగా విడుదలైన ఒక అధ్యయనం బీర్ బాబులకు ఫుల్ జోష్ తెచ్చేలా చేసింది. సదరు రిపోర్టు సారాంశం ఏమంటే.. బీర్ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెబుతూ.. బీర్ ను భేషుగ్గా తాగండి అంటూ ధీమాగా చెప్పేయటం ఆసక్తిగా మారింది.

అయితే.. ఇప్పుడు చెప్పే అంశాలన్నిసదరు అధ్యయనం చెప్పిన అంశాలే తప్పించి.. నిపుణులు వెల్లడించిన విషయాలుగా మాత్రం భావించొద్దు. దీన్నిసమాచారం కోసమే తప్పించి.. బీర్ ను రెగ్యులర్ గా తాగాలన్న విషయాన్ని చెప్పినట్లు మాత్రం కాదన్నది మర్చిపోకూడదు. ఇంతకూ ఈ రిపోర్టును ఎవరు పబ్లిష్ చేశారంటూ అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ. ఆ రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల బీర్ తీసుకుంటే గుండెపోటుప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. గుండె సమస్యలతో బాధ పడే వారు బీర్ తాగాలన్న నిర్ణయం మంచి ఆప్షన్ గా పేర్కొంటున్నారు.

ఇలాంటి వారు బీర్ ను క్రమబద్దంగ వాడితే.. దాదాపు ఇరవై ఏళ్లకు పైనే జీవిస్తారని చెప్పటం గమనార్హం. బీర్ లో వైన్ కంటే ఎక్కువ పోషకమైనదిగా పేర్కొంటున్నారు. బీర్ లో ఎక్కువ ప్రోటీన్ లు.. విటమిన్ బీ రెండూ ఉంటాయని చెబుతున్నారు. బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయని.. వివిధ వ్యాధుల నుంచి అది రక్షిస్తుందని పేర్కొన్నారు. షుగర్ సమస్య కూడా తక్కువని చెబుతూ.. వారానికి పద్నాలుగు గ్లాసుల బీర్ తాగితే టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దాదాపు ఏడు వేల మందిపై జరిపిన అధ్యయనం పేర్కొందన్నారు.

బలమైన ఎముకల కోసం పాలు ఎలా పని చేస్తుందో.. బీర్ కూడా అలానే శక్తిని ఇస్తుందని చెప్పటం విశేషం. బీర్ తాగే వారి దంతాలు కూడా బాగుంటాయని.. దీన్ని తాగితే.. పెదాలపై చిరునవ్వు తగ్గదని పేర్కొంటున్నారు. పళ్లకు సమస్యలుగా పేర్కొనే కావిటీస్.. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించటంలో బీర్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇందులోని అంశాల శాస్త్రీయతను మరోసారి చెక్ చేసుకోవటం మంచిదని చెప్పకతప్పదు.