Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇన్ఫ్లుయెన్సర్ రూ.10కోట్ల లంబోర్ఘిని కారు దగ్ధం.. అసలేం జరిగిందంటే?

ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి చెందిన ఏకంగా రూ.10 కోట్ల విలువైన లంబోర్గిని కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

By:  Tupaki Desk   |   4 Aug 2025 5:27 PM IST
నడిరోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇన్ఫ్లుయెన్సర్ రూ.10కోట్ల లంబోర్ఘిని కారు దగ్ధం.. అసలేం జరిగిందంటే?
X

సాధారణంగా అప్పుడప్పుడు కారు లేదా బైక్ నుండి మంటలు చెలరేగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ మంటలు వ్యక్తుల ప్రాణాలను కూడా బలి తీసుకునే స్థాయికి చేరుకుంటాయి. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమైతే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు నడిరోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి చెందిన ఏకంగా రూ.10 కోట్ల విలువైన లంబోర్గిని కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విషయం గమనించిన కార్ యజమాని వెంటనే కారు నుంచి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అటు స్థానికుల సహాయంతో 10 కోట్ల రూపాయల విలువచేసే ఆ కారులో మంటలు ఆర్పడానికి నీళ్లు , ఇసుకతో చాలాసేపు కష్టపడ్డారు. చివరికి ఆ మంటలు ఆగిపోయాయి. ఇకపోతే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆగస్టు 2వ తేదీ శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సంజీవ్ అనే వ్యక్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా ఇతడు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు ఇంస్టాగ్రామ్ లో కూడా దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. పైగా సంజీవ్ దగ్గర కోట్ల విలువ చేసే కార్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి 10 కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్ఘిని అవెంటడార్ కార్ కూడా ఒకటి. ఇది 2019 సంవత్సరానికి సంబంధించిన మోడల్ స్పోర్ట్స్ కార్ కావడం గమనార్హం. . ఈ కారును తీసుకొని శనివారం సాయంత్రం సంజయ్ రోడ్డుపై వెళ్తున్నాడు. అయితే సడన్గా కారు బ్యాక్ సైడ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును రోడ్డుపైనే ఆపేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కార్లో మంటలు చెలరేగడం చూసిన జనం కూడా సంజయ్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

అటు స్థానికులు ఇటు సంజయ్ ఇసుక, నీళ్లతో మంటలను ఆర్పడం మొదలుపెట్టారు. చాలా సేపు కష్టపడ్డ తర్వాత మంటలు ఆగిపోయాయి అని తెలుస్తోంది. ఇకపోతే రోడ్డుపై వెళ్తున్న కార్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏంటో ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంపై సంజయ్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.