Begin typing your search above and press return to search.

గాంధీలు ఎవ‌రూ దేశం వ‌దిలి పారిపోలేదు.. ముగ్గురు మోడీలు మాత్రం

ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తాజాగా ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న పంచ్ రువ్వారు

By:  Tupaki Desk   |   20 July 2023 4:10 AM GMT
గాంధీలు ఎవ‌రూ దేశం వ‌దిలి పారిపోలేదు.. ముగ్గురు మోడీలు మాత్రం
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విప‌క్షాలు చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో 26 పార్టీల‌కు చెందిన నాయ‌కులు, కొంద‌రు ముఖ్య‌మంత్రులు కూడారెండు రోజుల పాటు బెంగ‌ళూరులో స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

ఇదిలావుంటే.. బిహార్‌కు చెందిన ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తాజాగా ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న పంచ్ రువ్వారు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌ధాని మోడీ త‌ర‌చుగా గాంధీల కుటుంబాన్ని విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. దేశాన్ని 60 ఏళ్ల‌పాటు పాలించార‌ని.. వారి వ‌ల్ల దేశానికి ఒరిగిందేమీ లేద‌ని.. తాజాగా ఢిల్లీలో నిర్వ‌హించిన ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల భేటీలోనూ మోడీ విమర్శించారు.

అంతేకాదు త‌న‌కు వ్య‌తిరేకంగా చేతులు క‌లిపిన వారు.. అవినీతి, అక్ర‌మార్కులేన‌ని తీర్మానం చేశారు. ఇక‌, దీనికి కౌంట‌ర్‌గా బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ రియాక్ట్ అయ్యారు.

"ఔను. నిజ‌మే! 60 ఏళ్లు గాంధీలు ఈ దేశాన్ని పాలించినా.. ఏ ఒక్క గాంధీ కూడా ఈ దేశం నుంచి ప్ర‌జ‌ల సొమ్మును తీసుకుని దేశం వ‌దిలి పారిపోలేదు" అని కౌంట‌ర్ ఇచ్చారు. అంతేకాదు.. "మోడీల పాల‌న‌లో కేవ‌లం 8 ఏళ్ల‌లోనే ముగ్గ‌రు మోడీలు ప్ర‌జ‌ల సొమ్మును తీసుకుని, బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టి ఈ దేశాన్ని వ‌దిలి పారిపోయారు" అని లాలూ నాలుగు వాక్యాల్లో నిప్పులు చెరిగే ప‌దాల‌తో మోడీపై విరుచుకుప‌డ్డారు.

అయితే.. ఇక్క‌డ లాలూ సాహ‌సం అయితే చేశారు. గ‌తంలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌గా ఇలానే 'మోడీ' ఇంటి పేరుతో చేసిన కామెంట్ల‌పై ఆయ‌న‌పై ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు కావ‌డం.. లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకావ‌డం తెలిసిందే.

దీనిపై శిక్ష కూడా ప‌డింది. మ‌రి ఇప్పుడు లాలూ ప్ర‌సాద్ మ‌ళ్లీ ఇదేరేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. మ‌రి ఆయ‌న‌పై మ‌రో కేసు న‌మోదుచేస్తారేమో చూడాలి.. అని నెటిజ‌న్లు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.