ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం - లక్ష్మీపార్వతి
ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి పార్టీ సీనియర్ నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారి ఇంట్లో విందు సమావేశానికి హాజరయ్యారు.
By: Tupaki Desk | 14 Nov 2025 9:30 PM ISTగత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి పార్టీ సీనియర్ నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారి ఇంట్లో విందు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు.
లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి , కోట శ్రీనివాస్ రెడ్డి,దూడల కిరణ్ రెడ్డి,నరెడ్డి ఉమా శంకర్ ,కృష్ణ చైతన్య కామరాజు , నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
