Begin typing your search above and press return to search.

కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తున్న లగడపాటి... ప్రాంతీయం వర్సెస్ ప్రాంతీయం!

వరుసగా దక్షిణాదిలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కన్ను ఇప్పుడు ఏపీ పై పడిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 10:16 AM GMT
కొత్త డౌట్స్  క్రియేట్  చేస్తున్న లగడపాటి... ప్రాంతీయం వర్సెస్  ప్రాంతీయం!
X

వరుసగా దక్షిణాదిలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కన్ను ఇప్పుడు ఏపీ పై పడిందని అంటున్నారు. గతమెంతో ఘనం, వర్తమానం అయోమయం, భవిష్యత్తు ప్రశ్నార్ధకం అన్నట్లుగా ఉందని చెప్పే ఏపీకాంగ్రెస్ కు వైఎస్ షర్మిళ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని అంటున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్లలో కాస్త ఉత్సాహం కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న సమయంలో... ఆ పార్టీ ఉమ్మడి ఏపీలో బలంగా ఉండేది! అందులో భాగంగానే 2014, 2019ల్లో వరుసగా అధికారంలోకి వచ్చింది. అదంతా వైఎస్సార్ కష్టం అని చెప్పిన మాటకు బలం చేకురుస్తూ అనంతర కాలంలో ఏపీలో శాపగ్రస్థ పార్టీగా మిగిలిపోయిందని చెప్పినా అతిశయోక్తి కాదనేలా మారిపోయింది!

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. జెండా మోసే కార్యకర్త, పోటీకి దిగే నాయకులు కరువైన పరిస్థితికి తీసుకెళ్లిపోయారు! అయితే... ఆ కార్యక్రమం జరిగి పదేళ్లైంది కాబట్టి ఏపీ వాసులు నాటి సంగతులు మరిచిపోయారేమో.. అని ఏపీ ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనావేశారో ఏమో కానీ... ఇప్పుడు ఏపీపై దృష్టిపెట్టారని తెలుస్తుంది.

ఈ సమయంలో త్వరలో వైఎస్ షర్మిళ ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నఫలంగా తెరపైకి వచ్చారు! ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజమండ్రి మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భెటీ అయ్యారు.

అవును... ఈస్ట్ లో పర్యటించిన లగడపాటి... ముందుగా జీవీ హర్షకుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని.. ఇకపై తాను ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోనని స్పష్టం చేసిన లగడపాటి.. హర్షకుమార్, అరుణ్ కుమార్ లు ఎక్కడ నుంచి, ఏ పార్టీ తరుపున పోటీచేసినా తన మద్దతు ఉంటుందని అన్నారు.

దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఆల్ మోస్ట్ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయాలు తాను దూరం అన్నట్లుగా ఉండవల్లి ఏనాడో ప్రకటించిన నేపథ్యంలో... ఆయన ఎక్కడ నుంచి, ఏ పార్టీ తరుపున పోటీచేసినా తాను మద్దతిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే షర్మిళ ఎంట్రీ అనంతరం ఏపీ కాంగ్రెస్ లో పలు సమీకరణలు చోటు చేసుకుంటున్నాయని అంటున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే... ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని లగడపాటి వ్యాఖ్యానించడం! ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మరికొన్ని సందేహాలకు తావిస్తుందని అంటున్నారు పరిశీలకులు.

జాతీయపార్టీలు అధికారంలో ఉంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అని లగడపాటి అని ఉంటే... కాంగ్రెస్ తరుపున మాట్లాడి ఉండవచ్చు కానీ... ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ అని చెప్పడంవల్ల టీడీపీ తరుపున వకాల్తా పుచ్చుకుని ఈ ఇద్దరు నేతలతోనూ భేటీ అయ్యారా అనే ఊహాగాణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా... ఎన్నికల ఏడాది కావడంతో ఏపీ రాజకీయాల్లో ఏ చిన్న భేటీ జరిగినా అది హాట్ న్యూసే!