Begin typing your search above and press return to search.

ఈ మహిళా సినీ నిర్మాత చిత్రాలు అన్నీ ఇన్నీ కాదయా!

దీంతో... సదరు కెమెరా అసిస్టెంట్ డిన్నర్ కి వెళ్లాడు!! అనంతరం... వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందట!

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:40 AM GMT
ఈ మహిళా సినీ నిర్మాత చిత్రాలు  అన్నీ ఇన్నీ కాదయా!
X

డబ్బుల కోసం ప్రేమ, పెళ్లి పేరుతో డ్రామాలు ఆడటం.. అనంతరం ప్లేట్ ఫిరాయించడం.. గృహ హింస కేసు పెట్టి ఆస్తిలో వాటాలు డిమాండ్ చేయడం.. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడం వంటి సంఘటనలు చాలానే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అలాంటి నిత్యపెళ్లి కూతురు సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. వ్యవహారం గుట్టు రట్టవ్వటంతో ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అవును... డబ్బుల కోసం ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం, వేధింపులకు పాల్పడుతూ మానసికంగా చిత్రవధ చేయడం, అనంతరం రివర్స్ లో కేసులు పెడుతున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అలాంటి పనికి పాల్పడిన ఒక మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ఆమెపై 389, 420, 419, 494 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి జూబ్లీహిల్స్, వెంకటగిరిలో నివాసముంటున్నాడు. అతడికి ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఆమెతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఒకరోజు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన ఇంటికి డిన్నర్ కు రావాలని ఆమె కోరింది! దీంతో... సదరు కెమెరా అసిస్టెంట్ డిన్నర్ కి వెళ్లాడు!! అనంతరం... వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందట!

ఈ క్రమంలో... కొన్నాళ్ల తర్వాత.. ఆమె గర్భం దాల్చినట్లు చెప్పిందట. అయితే.. తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని నమ్మించిందట. ఈ సమయంలో తనను పెళ్లిచేసుకోవాలని ఆ కెమెరా అసిస్టెంట్ ని కోరడంతో... వీరిద్దరూ చిలుకూరి బాలాజీ గుడిలో వివాహం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత తనకు డబ్బులు కావాలని ఆమె కోరడంతో... 18.5 లక్షలు ఇవ్వడం, అనంతరం రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయడం చేశాడని తెలుస్తుంది!

అయితే... ఇతని వద్ద నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడం.. ఫలితంగా తరచూ గొడవలు పడటం జరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె గురించి వాకబు చేయగా... ఆమెకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తాజాగా చిలుకూరి బాలాజీ టెంపుల్ లో తనతో జరిగింది మూడో వివాహం అని.. పైగా అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలిందట!

దీంతో... ఆమెకు ఈ విషయంపై నిలదీశాడట సదరు కెమెరా అసిస్టెంట్. దీంతో... అతడిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టించింది ఈ సినీ మహిళా నిర్మాత!! అయితే... ఆమె గతంలో ఇలా పలువురిని ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టిందని తేలిందని తెలుస్తుంది. దీంతో ఆమె మోసాల చిట్టాలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇతడు వెళ్లడించగా... ఆమెపై పోలీసులు కేసు నమోదూ చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది.