Begin typing your search above and press return to search.

'ఉచిత' ప‌థ‌కంలో అన‌ర్హుల‌కు డ‌బ్బు.... కేసులు పెడ‌తామ‌న్న ప్ర‌భుత్వం

మ‌హారాష్ట్ర‌లో వెలుగు చూసిన ఓ వ్య‌వ‌హారం.. అక్క‌డి ప్ర‌భుత్వానికి ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో అస‌లు ఈ ప‌థ‌కాన్ని ఎత్తేసే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నామ‌ని.. డిప్యూటీ సీఎం ప్ర‌క‌టించేశారు

By:  Tupaki Desk   |   28 July 2025 9:49 AM IST
ఉచిత ప‌థ‌కంలో అన‌ర్హుల‌కు డ‌బ్బు.... కేసులు పెడ‌తామ‌న్న ప్ర‌భుత్వం
X

ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డం.. అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. అయితే.. కొన్ని ప్ర‌భుత్వాలు వీటిని లైట్ తీసుకుంటున్న ప‌రిస్థితి ఉంటోంది.. మ‌రికొన్ని ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్నాయి. అయితే.. ఈ 'ఉచిత ప‌థ‌కాలు' ఇస్తున్నారు క‌దా అని.. చాలా మంది దొడ్డిదారిలో త‌మ‌కు అర్హ‌త‌లేక‌పోయినా.. వీటిని పొందేస్తున్నారు. ఇది స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దీంతో ఏకంగా.. స‌ద‌రు ఉచిత ప‌థ‌కాల‌ను ఎత్తేసే ప‌రిస్థితి వ‌స్తోంది.

మ‌హారాష్ట్ర‌లో వెలుగు చూసిన ఓ వ్య‌వ‌హారం.. అక్క‌డి ప్ర‌భుత్వానికి ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో అస‌లు ఈ ప‌థ‌కాన్ని ఎత్తేసే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నామ‌ని.. డిప్యూటీ సీఎం ప్ర‌క‌టించేశారు. అయితే.. ప‌థ‌కం ఎత్తే స్తారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. స‌ర్కారు పేద‌ల కోసంఅమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాన్ని ధ‌న‌వంతు లు.. అన‌ర్హులు కూడా వినియోగించుకోవ‌డం.. దీనికి కొంద‌రు క్షేత్ర‌స్థాయి సిబ్బంది కూడా చేతులు క‌ల‌ప డం.. వంటివి చ‌ర్చ‌నీయాంశం అయ్యాయిం.

ఏం జ‌రిగింది?

+ మ‌హారాష్ట్ర‌లో గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో పేద కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500 చొప్పున నెల‌కు ఆర్థిక సాయం చేస్తామ‌నిబీజేపీ కూట‌మి(మ‌హాయుతి) హామీ ఇచ్చింది.

+ ఈ ప‌థ‌కం పేరు ల‌డ్కీ బ‌హ‌న్ యోజన‌. ఇది పూర్తిగా పేద కుటుంబాల్లోని 21-65 ఏళ్ల వ‌య‌సున్న మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తించే ప‌థ‌కం. నెల‌కు రూ.1500 చొప్పున వారి వారి ఖాతాల్లో జ‌మ చేస్తున్నారు.

+ ఈ ప‌థ‌కంలో ఇప్పుడు త‌వ్వుతున్న కొద్దీ లోపాలు వెలుగు చూస్తున్నాయి.

+ కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే చెందే ఈ ప‌థ‌కంలో 14,300 మంది పురుషులు ఏడాది కాలంగా రూ.1500 చొప్పున అందుకుంటున్నారు. వీరంతా త‌మ పేర్ల‌ను `మ‌హిళ‌ల పేర్లు`గా మార్చుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు గిరీష్‌.. గిరీష‌గా.. మార్చేసుకున్నారు.

+ ఒక కుటుంబంలోని ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేయాల్సి ఉండ‌గా..ముగ్గురు న‌లుగురు కూడా దీనిలో చేరిపోయారు.

+ గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 65 ఏళ్లుగా ఉంటే.. ఈ వ‌య‌సు దాటిన వారు 3 ల‌క్ష‌ల మంది ఈ ప‌థ‌కంలో ల‌బ్ధి పొందుతున్నారు. పైగా వీరు వృద్ధాప్య పింఛ‌ను కూడా పొందుతున్నారు.

+ కార్లు, బంగ‌ళాలు, ఆదాయ ప‌న్నుక‌ట్టే మ‌హిళ‌ల‌ను ఈ ప‌థ‌కానికి అన‌ర్హులుగా పేర్కొన్నారు. కానీ, వీరు కూడా దీని కింద రూ.1500 చొప్పున ఏడాది కాలంగా పొందుతున్నారు. ఇలాంటివారు ల‌క్షా 70 వేల మంది ఉన్నారు. దీంతో స‌ర్కారు అస‌లు ఈ ప‌థ‌కాన్ని ఎత్తేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. అంతేకాదు.. అనర్హులైన వారు పొందిన సొమ్మును వెన‌క్కి ఇవ్వాల‌ని లేక‌పోతే.. ఆర్థిక నేరాల చ‌ట్టం కింద కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది.