Begin typing your search above and press return to search.

తిరుమ‌ల ల‌డ్డూ: ఏక స‌భ్య క‌మిష‌న్‌పై ర‌చ్చ‌

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని వైసీపీ హ‌యాంలో క‌ల్తీ నెయ్యి వినియోగించి త‌యారు చేసిన వ్య‌వ‌హా రం రాజ‌కీయంగా ఇప్ప‌టికీ దుమారం రేపుతూనే ఉంది.

By:  Garuda Media   |   23 Feb 2026 9:12 AM IST
తిరుమ‌ల ల‌డ్డూ: ఏక స‌భ్య క‌మిష‌న్‌పై ర‌చ్చ‌
X

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని వైసీపీ హ‌యాంలో క‌ల్తీ నెయ్యి వినియోగించి త‌యారు చేసిన వ్య‌వ‌హా రం రాజ‌కీయంగా ఇప్ప‌టికీ దుమారం రేపుతూనే ఉంది. 2024, సెప్టెంబరులో ప్రారంభ‌మైన ఈ దుమారం.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఈ క్ర‌మంలోనే సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో విచార‌ణ‌కు ఆదేశించిం ది. అయితే.. ప్ర‌ధాన నిందితులుగా ఉన్న అప్ప‌టి టీడీపీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స‌హా.. మ‌రికొంద‌రి ప్ర‌స్తా వ‌న లేక‌పోవ‌డాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది.

అదేస‌మ‌యంలో క‌ల్తీ నెయ్యి విష‌యంలో కోట్ల రూపాయ‌లు చేతులు మారిన‌టు ఆరోప‌ణ‌లు ఉన్నా.. ఆ విషయంలోనూ సీబీఐ అధికారులు ప్ర‌త్యేకంగా విచార‌ణ చేయ‌లేద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యం లోనే సొంత‌గా విచార‌ణ‌కు నిర్ణ‌యించింది. అయితే.. అది పోలీసులు.. ఇత‌ర విభాగాల‌తో కాకుండా.. మాజీ ఐఏఎస్ అధికారితో విచార‌ణ‌కు సిద్ధ‌మైంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ కేసును రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌కు అప్ప‌గించ‌నున్నారు.

స్వామి ఎంట్రీ..

ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై.. బీజేపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఎంట్రీ ఇచ్చారు. తిరుమల కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఆయ‌న‌ సవాల్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న పిటిష‌న్ కూడా వేశారు. గ‌తంలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు సీబీఐ నేతృ త్వంలో సిట్ వేసింద‌ని.. ఈ విచార‌ణ కూడా పూర్త‌యిందని.. కానీ, ఎలాంటి తీర్పు లేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయడంపై ఆయ‌న‌ అభ్యంతరం తెలిపారు.

ఈ పిటిష‌న్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఏకసభ్య కమిటీ, సీబీఐ, టీటీడీ అధికారుల‌ను సుబ్ర‌మ‌ణ్య స్వామి ప్ర‌తివాదులుగా చేర్చారు. ఈ కేసు త్వ‌ర‌లోనే విచార‌ణకు రానుందని స‌మాచారం. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక‌.. వైసీపీ ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నా యి. ఏక‌స‌భ్య క‌మిష‌న్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన వెంట‌నే వైసీపీ గ్రౌండ‌వ‌ర్క్‌ను ప్రిపేర్ చేసుకుని ఉంటుంద‌ని భావిస్తున్నారు. మరిఏం జ‌రుగుతుందో చూడాలి.