కాలు నరికి బైక్ మీద ఊరేగింపు.. రీల్ లోనూ ఇంతటి అరాచకం ఉండదేమో?
అరాచక ఘటనకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కర్నూలు జిల్లా.
By: Tupaki Desk | 3 July 2025 10:04 AM ISTఅరాచక ఘటనకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కర్నూలు జిల్లా. రీల్ లోనూ ఇలాంటి జుగుప్సకు గురి చేసే సీన్ ఉండదేమో అన్నట్లుగా ఈ అరాచకవాదుల తీరు ఉందని చెప్పాలి. తమను మాటలతో వేధిస్తున్నాడన్న పేరుతో సదరు వ్యక్తి కాలిని నరికి.. దాన్ని తీసుకొని ఊరంతా బైక్ మీద తిరుగుతూ.. ఊరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన షాకింగ్ ఉదంతం కర్నూలు జిల్లాలోని సూదిరెడ్డిపల్లెలో చోటు చేసుకుంది.
ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. సూదిరెడ్డిపల్లికి చెందిన 62 ఏల్ల కురవ శేషన్న లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన పరశురాముడిని తరచూ మాటలతో వేధిస్తాడన్న పేరుంది. పరశురాముడికి వినికిడి లోపం ఉండటంతో అతడ్నిచూసి చులకనగా మాట్లాడేవాడని.. అతడి భార్యను హేళన చేసే వాడన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
ఇది మంచి పద్దతి కాదంటూ శేషన్నకు పలుమార్లు చెప్పనా.. అతడు పెద్దగా పట్టించుకునేవాడు కాడు. పరశురాముడ్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా అతడి తీరులో మార్పు రాకపోవటంతో తాజాగా తీవ్ర ఆగ్రహానికి గురైన పరశురాముడు.. తన ముగ్గురు సోదరులు(బీసన్న, కుమార్, గోవిందప్ప)తో కలిసి మంగళవారం రాత్రి శేషన్న ఇంటికి వెళ్లారు.
అతడి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో అతడి కుడి కాలిని మోకాలి వరకు నరికేశారు. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్ వరకు బైక మీద తిరిగారు. తమతో పాటు నరికిన కాలును ఊళ్లో వాళ్లందరికి చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శేషన్న తప్పు చేసి ఉండొచ్చు.కానీ.. ఈ తరహా వ్యవహారశైలి క్షమించరానిది. మెకాలి వరకు నరికేయటం.. అనంతరం తీవ్ర రక్తస్రావం కావటంతో శేషన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
