Begin typing your search above and press return to search.

ధియేటర్లలో అశ్లీల సినిమాలు...డీకే మీద కుమారస్వామి హాట్ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుత కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. డీకే తన టూరింగ్ థియేటర్లలో అశ్లీల చిత్రాలు ప్రదర్శించేవారు అని మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:22 PM GMT
ధియేటర్లలో  అశ్లీల సినిమాలు...డీకే మీద కుమారస్వామి హాట్ కామెంట్స్
X

కర్నాటకలో ఎన్నికలు జరిగి నెలలు అవుతోంది. కానీ ఆ వేడి మాత్రం ఇంకా అలాగే ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుత కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. డీకే తన టూరింగ్ థియేటర్లలో అశ్లీల చిత్రాలు ప్రదర్శించేవారు అని మండిపడ్డారు.

డీకే డొడ్డనహళ్ళిలోని తన థియేటర్ లో సినిమాలు ప్రదర్శిస్తూ మధ్యలో అశ్లీల క్లిప్పింగ్స్ ని వేసేవారు అని ఫ్లాష్ బ్యాక్ ని విప్పేశారు. అటువంటి వ్యక్తి ఇపుడు ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. దొడ్డనహళ్ళి, శతానుర్ లలో అశ్లీల సినిమాలు వేసే వ్యక్తి అంటూ డీకే తీరుని దుయ్యబెట్టారు. అలాంటి వారు ఇలాగే ఉంటారని కూడా వెటకారం చేశారు.

అయితే దీనికి డీకే కూడా తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. తాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనకపురి నుంచి లక్షా 23 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను అంటే ప్రజల అభిమానం అది అన్నారు. పైగా తన ప్రజలు ఏకంగా భారీ మెజారిటీ ఇచ్చి కర్నాటకలోనే రికార్డు క్రియేట్ చేశారు అని కూడా డీకే చెప్పారు.

తాను అశ్లీల చిత్రాలు ప్రదర్శించేవాడిని అన్నట్లైతే గత కాంగ్రెస్ జేడీఎస్ మంత్రివర్గంలో తనను ఎందుకు తీసుకున్నారు అని ఎదురు ప్రశ్నించారు. ఎవరైనా కావాలంటే కనకపురాకి వెళ్ళి అక్కడ తన థియేటర్ లో గతంలో ఆడిన సినిమాలు ఏంటి అన్నది విచారణ చేసుకోవచ్చు కూడా డీకే సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే డీకే శివకుమార్ గతంలో కొన్ని సినిమా హాళ్ళు నిర్వహించేవారు. అందులో దొడ్డనహళ్ళి, హరుబిలి, కొదిహళ్ళితో పాటు హునేసహళ్ళి వంటి ప్రాంతాలలో టూరింగ్ టాకీసులు ఉండేవి. ఇక హునేసహళ్ళిలో ఇప్పటికీ ఒక థియేటర్ తన పేరు మీదనే ఉందని కావాలంటే వాకబు చేసుకోవచ్చు అని డీకే ఘాటుగా బదులిస్తున్నారు.

తన పేరు మీదనే థియేటర్లలో అంతా సక్రమంగానే ఉందని తాను ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని డీకే స్పష్టం చేస్తున్నారు. అసలు ఇంతకీ డీకే కుమారస్వామిల మధ్యన ఎందుకు వివాదం రాజుకుంది అంటే దానికి ఒక కధ ఉంది అంటున్నారు.

ఇటీవల జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా దీపాల అలంకరణ కోసం కుమారస్వామి కుటుంబం నేరుగా విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ ని తీసుకుంది అని కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ విద్యుతు చోరుడూ అని ఆయన మీద పోస్టర్లు వేశారు. దీంతో మండిపోయిన కుమారస్వామి డీకే మీద ఇలా కామెంట్స్ చేశారు అన్న మాట.

అంతే కాదు డెకరేటర్ చేసిన తప్పిదానికి తాను బదులుగా 68 వేల రూపాయలు జరీమానా కట్టానని గుర్తు చేస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ వారు తనను టార్గెట్ చేసుకున్నారు అని ఆయన మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన డీకే మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తూ అశ్లీల సినిమాలు అంటూ ఫ్లాష్ బ్యాక్ ఎత్తారు. మొత్తానికి అటు డీకే ఇటు కుమారస్వామిల మధ్య డైలాగ్ వార్ కర్నాటకలో కొత్త రాజకీయ వేడిని రగిలిస్తోంది.