Begin typing your search above and press return to search.

రేవంత్ ఫేక్ న్యూస్ పెడ్లర్.. జైల్లో వేయాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్

వేర్వేరుగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసినా.. తెలంగాణలో ఇంకా రాజకీయ వేడి రగులుతూనే ఉంది

By:  Tupaki Desk   |   24 May 2024 7:31 AM GMT
రేవంత్ ఫేక్ న్యూస్ పెడ్లర్.. జైల్లో వేయాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

వేర్వేరుగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసినా.. తెలంగాణలో ఇంకా రాజకీయ వేడి రగులుతూనే ఉంది. స్ధానిక సంస్థల ఎన్నికల నాటికి ఇంకెంత ముదురుతుందో కానీ.. ఉన్నట్లుండి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ వార్ మొదలుపెట్టారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. రేవంత్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన ఓ ఫేక్‌ న్యూస్‌ పెడ్లర్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ ఔషధాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఇచ్చామంటూ సీఎం రేవంత్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆరోపించిన సంగతిని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో సచివాలయంలో నిజాం ఆభరణాల కోసం సొరంగం తవ్వినట్లు కథనాలు పుట్టించారని, దీన్నిబట్టి రేవంత్ ఫేక్‌ న్యూస్‌ పెడ్లర్‌ అని ధ్వజమెత్తారు.

అమిత్ షా పేరిటా వీడియో పుట్టించారు..

రేవంత్ ప్రభుత్వం.. రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్‌ సర్క్యులర్‌ నూ పోస్ట్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

మరింతగా మాటల మంటలు..

ఎన్నికల వాతావరణం ఇంకా ఉండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో మాటల మంటలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వరికి బోనస్ తదితరాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.. అయితే, తెలంగాణ అభివృద్ధి గురించి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.. ఇలాంటి సమయంలో కేటీఆర్ ట్వీట్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.