Begin typing your search above and press return to search.

కేటీయార్ కు రివర్సుకొట్టిందా ?

చివరకు డీకేపైన కేటీయార్ చేసిన ఆరోపణలు తప్పని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణా నుండి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించేస్తుంది అని చేసిన ఆరోపణలు తప్పని రుజువయ్యాయి.

By:  Tupaki Desk   |   6 Nov 2023 6:26 AM GMT
కేటీయార్ కు రివర్సుకొట్టిందా ?
X

రాజకీయనేతలు చేసే ప్రతి ఆరోపణ, ప్రతి విమర్శ ప్రతిసారి క్లిక్కవుతుందని అనుకునేందుకు లేదు. ఒక్కోసారి రివర్సు కూడా కొడుతుంది. అందులోను ఎన్నికల సమయంలో తొందరపాటుతో చేసే ఆరోపణలైతే మరీ ఇబ్బందిపెడతాయి. ఇపుడిదంతా ఎందుకంటే కాంగ్రెస్ ఇన్చార్జి, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విషయంలో మంత్రి కేటీయార్ చేసిన ఆరోపణ బ్యాక్ ఫైర్ అయ్యింది కాబట్టే. ఎన్నికల ప్రచారంలో కేటీయార్ మాట్లాడుతూ డీకేపై విరుచుకుపడ్డారు. తెలంగాణాలో ఫాక్స్ కాన్ కంపెనీని తెలంగాణా నుండి కర్నాటకు తీసుకెళ్ళేందుకు డీకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తన ఆరోపణలకు మద్దతుగా కర్నాటకలో ప్రముఖ మీడియా వెబ్ సైట్ లో వచ్చిన వార్తను ప్రస్తావించారు. యాపిల్ ఫోన్లకు వాడే ఇయర్ పాడ్స్ తయారీ కంపెనీ ఫాక్స్ కాన్ కంపెనీని డీకే బెంగుళూరుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఫాక్స్ కాన్ కంపెనీకి డీకే ఈ మేరకు లేఖ రాసినట్లు కూడా చెప్పారు. వెబ్ సైట్లో వచ్చిన వార్తను నమ్మి డీకేపై కేటీయార్ ఆరోపణలు గుప్పించారు. దాంతో వెంటనే డీకే రంగంలోకి దిగి సదరు వెబ్ సైట్లో వచ్చిన వార్తను చూశారు. అలాగే సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాను రాసిన వార్త వాస్తవమని ద వెబ్ సైట్ కూడా చెప్పలేకపోయింది.

చివరకు డీకేపైన కేటీయార్ చేసిన ఆరోపణలు తప్పని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణా నుండి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించేస్తుంది అని చేసిన ఆరోపణలు తప్పని రుజువయ్యాయి. మొన్నటివరకు కర్నాటక రైతులంటు ఫేక్ ప్రచారం చేయించారు.

చివరకు వాళ్ళు మీడియాతో మాట్లాడినపుడు తాము రైతులంకాదని పేమెంట్ చేస్తామని తమను తీసుకొచ్చి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయమంటే చేసినట్లు అంగీకరించారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయ్యింది. ముందువెనుక ప్రత్యర్ధులపై చేస్తున్న ఆరోపణలు ఒక్కోటి బ్యాక్ ఫైర్ అవుతున్నాయని కేటీయార్ గుర్తుంచుకోవాలి. రాజకీయంగా చేసుకునే ఆరోపణలు వేరు, అంతర్జాతీయ కంపెనీలను ప్రస్తావించి చేసే ఆరోపణలు వేరని కేటీయార్ గ్రహించకపోవటంతోనే ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.