Begin typing your search above and press return to search.

అన్నంత పని చేసిన కేటీఆర్.. వీడియోలతో డ్యామేజ్ చేసే వారికి లీగల్ నోటీసులు

దీనిపై ఫైర్ అయిన కేటీఆర్.. తాము ఇలాంటి వాటిపై లీగల్ గా పోరాడతామని చెప్పటం తెలిసిందే. తాజాగా ఆ యూట్యూబ్ చానళ్లలోని వీడియోలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్.

By:  Tupaki Desk   |   31 March 2024 5:31 AM GMT
అన్నంత పని చేసిన కేటీఆర్.. వీడియోలతో డ్యామేజ్ చేసే వారికి లీగల్ నోటీసులు
X

ప్రజాస్వామ్యంలో విమర్శకు తావు ఉంటుంది. అయితే.. అదేమీ హద్దులు దాటేలా ఉండకూడదు. అసలుతో సంబంధం లేకుండా.. ఎలాంటి చిన్న ఆధారాన్నిచూపకుండా ఇష్టం వచ్చిన రీతిలో వీడియోలు చేసేయటం.. వాటికి ఘోరమైన.. దారుణమైన క్యాప్షన్లను పెట్టటం.. వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్ చానళ్లలోథంబ్ నెయిల్స్ కు.. వీడియో హెడ్డింగ్ కు అందులోని కంటెంట్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండటం తెలిసిందే.

ఇలాంటి వీడియోలతో తమను టార్గెట్ చేస్తున్నారని తమ ఇమేజ్ ను బద్నాం చేస్తున్నట్లుగా మాజీ మంత్రి కం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడటం తెలిసిందే. తమను లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఈ మధ్యన వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. తాజాగా.. కొన్ని మీడియా సంస్థలు.. మరొకొన్ని యూట్యూబ్ చానళ్ల వారు కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా.. వారి క్యారెక్టర్లను తప్పుడు మార్గాల్లో చూపిస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

దీనిపై ఫైర్ అయిన కేటీఆర్.. తాము ఇలాంటి వాటిపై లీగల్ గా పోరాడతామని చెప్పటం తెలిసిందే. తాజాగా ఆ యూట్యూబ్ చానళ్లలోని వీడియోలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. మొత్తం పది సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేటీఆర్..గతంలోనూ తమపై తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు పంపినట్లుగా పేర్కొన్నారు.

వారు ప్రచారం చేస్తున్న వారి కారణంగా తనకు.. తన కుటుంబానికి తీవ్రమైన నష్టం కలిగించాలన్న దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. మీడియా ముసుగులో పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో తమకు సంబంధం లేని పలు అంశాల్లో.. తమ పేర్లు.. ఫోటోలు వాడుతూ తమను రాజకీయంగా దెబ్బ తీస్తున్నారని పేర్కొన్నారు.

ఈ చర్యల్ని కక్ష పూరితంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే సోషల్ మీడియా ఖాతాల్ని గుర్తించి.. వారిలో పలువురికి లీగల్ నోటీసులు పంపి.. తదుపరి చర్యలు చేపట్టనున్నట్లుగా అందులో పేర్కొన్నారు. మరి.. ఈ లీగల్ నోటీసులకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.