Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు నిజం ఏంటో.. ఫేక్ ఏంటో.. అస్సలు తెలియదు!

ఈ నేపథ్యంలో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కర్ణటక కీలకం అయ్యిందని అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Dec 2023 9:02 AM GMT
కేటీఆర్ కు నిజం ఏంటో.. ఫేక్ ఏంటో.. అస్సలు తెలియదు!
X

కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణకు వచ్చారు. షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి గెలుపు, ఎమ్మెల్యేలను తరలించే వరకు ఆ రాష్ట్రానికి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెంటనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కర్ణటక కీలకం అయ్యిందని అందరికీ తెలిసిందే.

అయితే కర్ణాటక మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలలో కొన్నింటిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొందు పరిచారు. అక్కడి గెలుపునకు ఇవి దోహదం చేశాయని పార్టీ అధిష్టానం భావించి తెలంగాణలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో భారీగానే సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మెల్ల మెల్లగా అమలు చేస్తూ వెళ్తుంది. ఇందులో భాగంగానే సోనియా గాంధీ పుట్టిన రోజున రాష్ట్ర మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీని ప్రారంభించింది. ఇక తర్వాత హామీ రూ. 500 కే సిలిండర్ పై కసరత్తు చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సిద్ద రామయ్య మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఏవేవో హామీలు ఇస్తాం.. అవన్నీ అమలు చేయాలని లేదు.. అవి అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా..’ అంటూ మాట్లాడడం వైరల్ గా మారింది. ఈ వీడియోను ఒక ఛానల్ లో పోస్ట్ చేయగా దాన్ని మాజీ ఐటీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టారు.. తెలంగాణలో కూడా భవిష్యత్ ఇదేనా?, విపరీతమైన హామీలు ఇచ్చే ముందు ఆర్థిక వనరులను కూడా చూసుకోవాలి కదా? అని ట్వీట్ లో రాశారు.

కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన సిద్ధ రామయ్య ‘మిస్టర్ కేటీఆర్ మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? మీకు ఏది నిజం.. ఏది ఫేక్ అనేది తెలియదు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోలను మీరు వాడుతున్నారు. అందుకే మీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అయ్యింది.’ అంటూ సిద్ధ రామయ్య కౌంటర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి. అయితే గతంలో కూడా ఫాక్స్ కాన్ చైర్మన్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారంటూ ఫేక్ లెటర్ ను కేటీఆర్ ట్విటర్ లో పోస్ట్ చేసి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు.

--------

ఒక ఛానల్ లో వచ్చిన వీడియోకు ట్వీట్ చేసిన కేటీఆర్