Begin typing your search above and press return to search.

గడ్డంతో ఉన్న కేటీఆర్ డిఫరెంట్ లుక్ పిక్ చూశారా?

ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:28 AM GMT
గడ్డంతో ఉన్న కేటీఆర్  డిఫరెంట్  లుక్  పిక్  చూశారా?
X

ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే. ఈ దశాబ్ధపు మోస్ట్ హాట్ ఇష్యూగా ఈ కృత్రిమ మేధ ఉంది! దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, చాలా ప్రమాదాలు ఉన్నాయి అంటూనే ఏదో ఓ రకంగా దీన్ని వాడేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో తయారు చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌ లో తెగ వైరల్‌ అవుతున్నాయి.


ఆదిపురుష్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లుక్‌ తో ఇంటర్నెట్‌ లో ఈ ఏఐ ఫొటోల వైరల్ అయినప్పటినుంచి వీటికి మరింత ప్రచారం లభించిందని చెప్పొచ్చు. నాటి మొదలు... సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఏఐ ఫొటోలు ఇంటర్నెట్‌ లో షేర్‌ చేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని వివాదాస్పదమవుతుండగా.. కొన్ని ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ ఏఐ పిక్ వైరల్ గా మరింది.

అవును... బీఆరెస్స్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కి సంబందించిన ఏఐ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా క్లీన్ షేవ్, నీట్ హెయిర్ కట్ తో కనిపించే కేటీఆర్ ని విభిన్నంగా ప్రజెంట్ చేసారు ఒక ఫ్యాన్. ఇందులో భాగంగా ఫుల్ కర్లింగ్ హెయిర్ తో పాటు గడ్డం తో ఉన్నట్లుగా ఏఐ ఫోటోని రూపొందించాడు. దీంతో... గడ్డం, జుట్టూ పెంచితే ఇలా ఉంటానంటూ స్మైల్ ఇమోజీతో తన ఎక్స్ లో స్వయంగా వెల్లడించారు.

కాగా... ఇటీవల కాలంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటోలులు ఇంటర్నెట్‌ లో తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ ఏఐ పిక్స్ లో కేసీఆర్ చాలా యంగ్ లుక్ లో కనిపించారు. బ్లాక్‌ బ్లేజర్‌, రేబాన్‌ సన్ గ్లాసెస్‌ తో చాలా స్టైలిష్‌ గా ఉన్నారు. నార్మల్‌ గా బయట వైట్‌ డ్రెస్‌ తో చాలా సింపుల్‌ గా ఉండే కేసీఆర్ ఫోటోలు మాత్రం... ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సినిమా హీరోలా తయారు చేశారు.