Begin typing your search above and press return to search.

కేటీఆర్ స్వేద పత్రం..కాంగ్రెస్ పై ఫైర్

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడక అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పు కేవలం 3.17 లక్షల కోట్లని, దానిని ఎక్కువ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 2:30 PM GMT
కేటీఆర్ స్వేద పత్రం..కాంగ్రెస్ పై ఫైర్
X

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ బకాయిలపై కాంగ్రెస్ శ్వేత పత్రం విడుదల చేసింది. అయితే, కాంగ్రెస్ కు దీటుగా బీఆర్ఎస్ నేతలు స్వేద పత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడక అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పు కేవలం 3.17 లక్షల కోట్లని, దానిని ఎక్కువ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ సర్కార్ పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఏపీలో తెలంగాణను విధ్వంసం చేశారని ఆరోపించారు.

తెలంగాణను వికాసం వైపు నడిపించిన బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్వేత పత్రం అంటూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శ్వేత పత్రంలో కాంగ్రెస్ పేర్కొన్న అప్పుల గురించి కేటీఆర్ ప్రస్తావించారు. 2014-15 నాటికి తెలంగాణ రుణం 72 వేల 658 కోట్లని, ప్రస్తుతం తెలంగాణ అప్పులు 3.17 లక్షలకు చేరాయని వివరించారు. అప్పులను, అభివృద్ధిని పోల్చి చూడాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

2013లో పేదరికం 21 శాతం ఉండగా 2023 నాటికి ఐదు శాతానికి తగ్గింది అన్నారు. 2014లో 1.14 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం 3.17 లక్షలకు చేరిందాని కేటీఆర్ వివరించారు. మరి, కేటీఆర్ స్వేద పత్రంపై కాంగ్రెస్ నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.