Begin typing your search above and press return to search.

కేటీయార్ తట్టుకోలేకపోతున్నారా ?

సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు పేర్లను గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపి ఫైలుపై సంతకం చేశారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:30 PM GMT
కేటీయార్ తట్టుకోలేకపోతున్నారా ?
X

గవర్నర్ తమిళిసై చర్యను కేటీయార్ తట్టుకోలేకపోతున్నారు. తమ హయాంలో ఎంఎల్సీలను భర్తీ చేయటంకోసం పంపిన రెండు పేర్లను తిరస్కరించిన గవర్నర్ ఇపుడు మాత్రం ఎలా యాక్సెప్ట్ చేశారంటు మండిపోయారు. కేసీయార్ హయాంలో పంపిన రెండు పేర్లు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటాలో నియమితులయ్యేవారు రాజకీయనేతలుగా ఉండకూడదని అప్పట్లో తమిళిపై కేసీయార్ ప్రభుత్వంకు స్పష్టంగా చెప్పారు.

సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు పేర్లను గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపి ఫైలుపై సంతకం చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ పేర్లను పంపింది. ఇందులో కోదండరామ్ నూరుశాతం రాజకీయ నేతే అనటంలో సందేంలేదు. 2018 ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేశారు. కోదండరామ్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి విజయం కోసం కష్టపడ్డారు. అప్పట్లో రేవంత్ రెడ్డి, కోదండరామ్ కు జరిగిన ఒప్పందం ప్రకారమే ఇపుడు ఎంఎల్సీ పదవి.

ఇక అమీర్ ఆలీఖాన్ సియాసత్ దినపత్రిక ఎడిటర్. అమీర్ ఆలీఖాన్ పేరు విషయంలో ఎక్కడా ఎవరి నుండి అభ్యంతరాలు వ్యక్తం కావటంలేదు. కాబట్టి అమీర్ అభ్యర్ధిత్వంపై సర్వత్రా సానుకూలత ఉందని అర్ధమవుతోంది. ఇదే విషయాన్ని కేటీయార్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో తమ ప్రభుత్వం పంపిన రెండుపేర్లను తిరస్కరించిన గవర్నర్ ఇపుడు కోదండరామ్ పేరును ఎలా ఆమోదించారని అడిగారు.

కేసీయార్ ప్రభుత్వం అంటే వ్యక్తిగతంగా గవర్నర్ పడని కారణంగానే అప్పట్లో తాము పంపిన పేర్లను తిరస్కరించిన విషయం ఇపుడు అర్ధమవుతోందన్నారు. గవర్నర్ నిర్ణయంపైన కేటీయార్ ఇపుడు బాగా మండిపోతున్నట్లు అర్ధమవుతోంది. వాస్తవంగా చూస్తే శ్రవణ్, సత్యనారాయణ, కోదండరామ్ మధ్య ఏమీ తేడాలేదు. ముగ్గురు రాజకీయ నేతలే అనటంలో సందేహంలేదు. కేసీయార్ పంపిన ఫైలును తిరస్కరించిన గవర్నర్ ఇపుడు రేవంత్ పంపిన ఫైలును ఆమోదించటం ఏమిటనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి వివరణ ఇవ్వాల్సింది రాజ్ భవనే.