Begin typing your search above and press return to search.

బాబు కీర్తన టీడీపీ ఓట్ల కోసమేనా కేటీయార్...?

టీడీపీ ఓట్లు ఇపుడు తెలంగాణాలో ఇంపార్టెంట్ గా మారిపోయాయి. రెండు ఎన్నికల నుంచి టీడీపీ ఓట్లను తమ వైపు టర్న్ చేసుకుని బీయారెస్ సులువుగా అధికారంలోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:45 AM GMT
బాబు కీర్తన టీడీపీ ఓట్ల కోసమేనా కేటీయార్...?
X

టీడీపీ ఓట్లు ఇపుడు తెలంగాణాలో ఇంపార్టెంట్ గా మారిపోయాయి. రెండు ఎన్నికల నుంచి టీడీపీ ఓట్లను తమ వైపు టర్న్ చేసుకుని బీయారెస్ సులువుగా అధికారంలోకి వస్తోంది. నిజంగా చూస్తే 2014లో 16 శాతం పైగా ఓట్లు వచ్చిన టీడీపీ 2018 నాటికి 3 శాతానికి పడిపోయింది. ఈ ఓట్లు అన్నీ కూడా బీయారెస్ కే ఎక్కువ కన్వర్ట్ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అన్నది బాహాటంగా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ కే టీడీపీ మద్దతు అని ప్రచారం అయితే సాగుతోంది. మరో వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు చంద్రబాబు అంటే ఇష్టమని చెప్పేసుకున్నారు. టీడీపీ తన పుట్టిల్లు అని అంటున్నారు.

ఇపుడు బీయారెస్ వంతుగా ఉంది. అందుకే కేటీయార్ బాబుని బాగా పొగుడుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. చంద్రబాబు మీద ఓటుకు నోటు కేసుని తాము మళ్లీ తిరగతోడలేదంటే అది కేసీయార్ ఔదార్యం అని ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటున్నారు. అలాగే బాబుని స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేసి జైలులో పెట్టిన ఘటన బాధాకరం అంటున్నారు.

తాము హైదరాబాద్ లో బాబు మద్దతుదారుల ఆందోళనలు చేయవద్దు అని చెప్పలేదని ధర్మా చౌక్ లో చేయమని మాత్రమే సూచించామని కేటీయార్ సర్దుబాటు చేసుకుంటున్నారు. తన మాటలు నొప్పించి ఉంటాయని అర్ధం మాత్రం ఇదే అంటున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ ఎంతలా తల్లడిల్లింది తాను అర్ధం చేసుకోగలను అని కూడా కేటీయార్ చెప్పుకొస్తున్నారు

తాను లోకేష్ రెగ్యులర్ గా మాట్లాడుకుంటామని కూడా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు పొలిటికల్ గా ఇప్పటికీ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నారని సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. బాబు మరో పది నుంచి పదిహేనేళ్ళ పాటు రాజకీయాలు చేయగలరు అని కూడా కేటీయార్ అంటున్నారు. ప్రధాని మోడీతో ముడి పెట్టి ఆయన కంటే బాబు వయసులో చిన్న వారు అని అంటున్నారు

బాబును పొగిడే ఉత్సాహంలో ఇక్కడే కేటీయార్ తప్పులో కాలేశారని అంటున్నారు. చంద్రబాబు మోడీ కంటే అయిదు నెలలు పెద్ద. చంద్రబాబు 1950 ఏప్రిల్ 20న పుట్టారు అని వికీ పీడియా రికార్డు చెబుతోంది. అలాగే నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న పుట్టారని అదే వికీ పీడియా రికార్డులో ఉంది. బాబు వయసు గురించి అందరికీ తెలుసు. ఆయనకు 73 ఏళ్ళు నిండాయి. మోడీకి 73 ఇటీవలే నిండాయి.

మరి కేటీయార్ మాత్రం బాబు మోడీ కంటే చిన్నవారని చెప్పడం మీద చర్చ సాగుతోంది. బాబుని ఆకాశానికి ఎత్తేస్తే టీడీపీ ఓట్లు పడతాయని భావిస్తున్నారని ఇది వ్యూహంలో భాగమే అని అంటున్నారు. అయితే ఈసారి టీడీపీ ఓట్లు ఎవరికి పడతాయన్నది నవంబర్ 30న జరిగే పోలింగులో తేలుతుంది అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో వ్యూహాలు ఎత్తులు అలా సాగుతూ ఉంటాయి. కేటీయార్ వ్యూహాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కేటీయార్ ఇంతలా కితాబులు ఇస్తూంటే తమ్ముళ్ళ మనసు కరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.