Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఈటల - కేటీఆర్ ఆలింగనం!

ఈ సమయంలో తాజాగా ఆఫ్టర్ లాంగ్ టైం కేటీఆర్ - ఈటల ఎదురుబదురయ్యారు. ఈ సమయంలో కేటీఆర్ వెళ్లి ఈటలను ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించారు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 2:55 PM GMT
అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్  సీన్.. ఈటల - కేటీఆర్  ఆలింగనం!
X

రాజకీయాల్లో శాస్వత శత్రువులూ, శాస్వత మిత్రులూ ఉండరని అంటుంటారు. ఆ లైన్ ఇప్పుడు సూట్ కాకపోవచ్చు కానీ... నిన్నమొన్నటివరకూ బీఆరెస్స్ వర్సెస్ ఈటల గా తెలంగాణ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయం నుంచీ ఈ సందడి అలానే కంటిన్యూ అవుతోంది. ఈ సమయంలో కేటీఆర్ - ఈటల కలుసుకున్నారు.

అవును... తెలంగాణ అసెంబ్లీలో ఈ గురువారం నుండి వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరకు వెళ్లి మరీ.. ఆయన్ని ఆలిగినం చేసుకుని, ఆప్యాయంగా పలకరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 10 నిమిషాల కన్నా ఎక్కువ సమయమే వీరిద్దరి సంభాషణ సాగింది.

అయితే రాజకీయంగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పై నిత్యం నిప్పులు చెరిగేవారు ఈటల. మరి ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తన ఓటమికోసం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. గెలిచిన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో హీరో స్థాయి ఎలివేషన్ సంపాదించారని అంటుంటారు.

అనంతరం హుజూరాబాద్ బీఆరెస్స్ ఇన్ ఛార్జ్ గా కౌశిక్ రెడ్డిని కేసీఆర్ నియమించారు! ఈ సమయంలో తన భర్తను హత్య చేయడం కోసం కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఈ మేరకు సుపారీ ఇచ్చి తన భర్తను లేకుండా చేయాలని భావిస్తున్నారని... ఈటల భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయాలపై స్పందించిన ఈటల... దీనివెనుక పెద్దల హస్తం ఉందని స్పందించారు!

ఆ సమయంలో కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈటల రాజేందర్ తనకు అన్నలాంటి వారని చెబుతూ... ఆయన సెక్యూరిటీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని చెప్పారు. హుటాహుటున పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈటల సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణాయాలే తీసుకున్నారు. ఈటలతో తనది రాజకీయాలకు అతీతమైన బంధం అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సమయంలో తాజాగా ఆఫ్టర్ లాంగ్ టైం కేటీఆర్ - ఈటల ఎదురుబదురయ్యారు. ఈ సమయంలో కేటీఆర్ వెళ్లి ఈటలను ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించారు. దీంతో రాజకీయాలకు అతీతమైన బంధం విరీద్దరిదీ అని.. ఈ కారణంగానే.. ఈటల పట్ల తన గౌరవాన్ని కేటీఆర్ వదులుకోలేదని అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ... తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ, బీజేపీ – బీఆరెస్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటూ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సమయంలో... వీరిద్దరూ ఇలా కలవడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. అయితే వీరి కలయికని రాజకీయాలకు అతీతంగా చూడాలని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

కాగా... బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో ఈటల రాజేందర్.. పార్టీ మారబోతున్నారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈటలతో రేవంత్ చర్చలు జరుపుతున్నారని బీఆరెస్స్ మంత్రి ఆరోపణలు చేయగా... ఈటల తో కేటీఆర్ టచ్ లో ఉన్నారని కూడా కామెంట్లు వినిపించాయి.