Begin typing your search above and press return to search.

రేవంత్ కి రెండో బాస్ మోదీ... నమ్మబుల్ గా ఉందా ?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్జంట్ గా ఒక మీడియా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసారు

By:  Tupaki Desk   |   24 May 2025 3:03 PM
రేవంత్ కి రెండో బాస్ మోదీ... నమ్మబుల్ గా ఉందా ?
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్జంట్ గా ఒక మీడియా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసారు. రాజకీయంగా చూస్తే బాగానే ఉంది. విపక్ష పార్టీ నేతగా ఎన్నో ఆరోపణలు చేయవచ్చు, విమర్శించవచ్చు. కానీ కేటీఆర్ చేసిన ఆరోపణలలో ఒకటి అయితే పెద్దగా చర్చకు వస్తోంది. అదే రేవంత్ కి ఇద్దరు బాస్ లు ఉన్నారని ఒక బాస్ రాహుల్ గాంధీ అయితే రెండో బాస్ నరేంద్ర మోడీ అని.

నిజానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ కి రాహుల్ గాంధీ బాస్ అవడం సహజం. అయితే రెండో బాస్ మాత్రం నరేంద్ర మోడీ ఎలా అవుతారు. ఆయన బీజేపీ. ఈయన కాంగ్రెస్. ఎక్కడ లంకె కుదురుతుంది అన్నదే జనాలకు అర్థం కాని పజిల్ గా ఉంది.

ఆరోపణలు చేస్తే ఓకే కానీ లాజిక్ కి అందాలి కదా అని అంటున్నారు. ఇక చూస్తే కేసీఆర్ తనయ కేటీఆర్ సోదరి అయిన కవిత రాసిన ఒక లేఖ బహిర్గతం అయి రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో బీజేపీని కేసీఆర్ గట్టిగా విమర్శించడం లేదు అని ఆమె పాయింట్ అవుట్ చేశారు.

పైగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే బీఆర్ ఎస్ కనీసం అభ్యర్ధులను కూడా పోటీకి పెట్టకుండా పోవడంతో రెండు పార్టీల మధ్య ఏదో ఉందని కాంగ్రెస్ చేసిన ప్రచారానికి బలం చేకూరుతోందని ఆమె లేఖలో ప్రస్తావించినట్లుగా ఉంది.

మరో వైపు చూస్తే కనుక బీఆర్ఎస్ లో కీలక నాయకురాలు కవిత ఇలా అనుమానం వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఏదో ఉందని అంతా అనుకునే నేపధ్యమూ ఉంది. ఈ పరిస్థితులలో కేటీఆర్ రేవంత్ కి బీజేపీకి లింక్ పెట్టి మోడీ రెండో బాస్ అని చెప్పడాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదే చర్చగా ఉంది. ఇది ఏ మాత్రం తర్కానికి అందడం లేదనే అంటున్నారు.

దీని మీద కాంగ్రెస్ మంత్రులు కూడా కేటీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. తన సోదరి రాసిన లేఖకు జవాబు చెప్పాల్సిన కేటీఆర్ మధ్యలోకి కాంగ్రెస్ ని లాగి విమర్శలు చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు అన్నారని కాదు కానీ ఇది ఏ మాత్రం సబబైన విమర్శ కాదేమో అన్నదే అంతా అంటున్నారు.

ఇక తెలంగాణాలోనే కాదు జాతీయ స్థాయిలో చూసినా కాంగ్రెస్ బీజేపీ బద్ధ శతృవులు. రాజకీయంగా వేరు వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు. రెండింటికీ వేరే కూటములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సంగతి చూస్తే ఆయనకు కాంగ్రెస్ ఎంతో చేసింది. కాంగ్రెస్ కి ఆయన కూడా చేశారు. అలా పరస్పరం అనుబంధం ఉంది.

ఎవరికి అయినా జీవిత కాలం కోరిక లక్ష్యం సీఎం పదవి అన్నది. దానిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ద్వారా సాధించారు. ఆయనకు ఇపుడు బీజేపీతో రాజకీయంగా ఏమి అవసరం ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. బీజేపీతో ఎందుకు రిలేషన్స్ కొనసాగించాలని అనుకుంటారు అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. అయితే కవిత లేఖ వల్ల వచ్చిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య లింక్ ని కేటీఆర్ తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు.

అయితే జనాలు దేనిని నమ్మాలో నమ్మకూడదో ఆలోచిస్తారు అని అంటున్నారు. ఆరోపణలు అన్నీ నిజాలు కావు, కొన్ని నిజాలు గా అనిపించినా అతికినట్లుగా ఉండాలి కదా అంటున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ బీజేపీ మధ్య బంధం రేవంత్ కి రెండో బాస్ మోడీ అంటే అది పెద్దగా జనాలకు ఎక్కడం లేదు అని అంటున్నారు. దానికి బదులు ప్రభుత్వం వైఫల్యాల మీద విమర్శలు చేస్తే దానికి వచ్చే గ్రాఫ్ వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు.