Begin typing your search above and press return to search.

ముందు చూపు అంటే చంద్రబాబుదే...కేటీఆర్ మాట !

ఇదిలా ఉంటే దేశంలో ఎల్ నినో ప్రభావం ఉందని ముందే గ్రహించిన చంద్రబాబు చాలా ముందుచూపును ప్రదర్శించారు అని తాజాగా కేటీఆర్ అభినందించారు.

By:  Satya P   |   29 Oct 2026 8:19 PM IST
ముందు చూపు అంటే చంద్రబాబుదే...కేటీఆర్ మాట !
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది దాదాపు అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రస్తుతం నాలుగవ సారి ఏపీకి సేవలు అందిస్తున్నారు. బాబుని విజనరీ అని చాణక్యుడు అని ఆయనను అభిమానించేవారు కొలుస్తారు. అయితే అదే బాబుని రాజకీయంగా విభేదించేవారు తమ నోటి వెంట మెచ్చుకోలుగా మాట్లాడితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా ఉంటుంది. చంద్రబాబుని అలా పొగిడిన వారు ఎంతో మంది చరిత్రలో ఉన్నారు. ఆయన కష్టపడే నైజం కానీ ఆయన దూరదృష్టి కానీ ప్రత్యర్ధులను సైతం ఆకర్షిస్తుంది. అందుకే తెలంగాణాలో బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చంద్రబాబుని పొగిడారు అని అంటున్నారు.

ఎల్ నినో సంక్షోభ సమయంలో :

ఇదిలా ఉంటే దేశంలో ఎల్ నినో ప్రభావం ఉందని ముందే గ్రహించిన చంద్రబాబు చాలా ముందుచూపును ప్రదర్శించారు అని తాజాగా కేటీఆర్ అభినందించారు. ఎల్ నినోతో పాటు కరవు పెద్ద ఎత్తున వస్తుందని గుర్తించిన చంద్రబాబు తగిన విధంగా వ్యవహరించడంతో ఇపుడు ఏపీ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉందని మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రోజుకు చూసినా తెలంగాణా కంటే ఏపీలోనే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతోందని అయినప్పటికీ ఎల్ నినో పరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు బాబు తీసుకున్నారని కేటీఆర్ విశ్లేషించారు.

వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా :

బాబు తీసుకున్న ఈ చొరవ ఫలితంగా ఏపీలో వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉందని కేటీఆర్ ప్రశంసించే విధంగా మాట్లాడారు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చూపించిన శ్రద్ధ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. బాబు చాలా తెలివిగా వ్యవహరించారు అని కూడా కేటీఆర్ అన్నారు. ఏపీని కాపాడుకునే విధంగా తగినంత నీటిని తరలించారని చెప్పారు.

కీలక ప్రాజెక్టులతో :

ఏపీకి అవసరం అయ్యే క్రిష్ణా గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బాబు చూపించిన చొరవని కేటీఆర్ అభినందించారు. దీని వల్లనే ఇపుడు ఎల్ నినో ప్రభావం చూపిస్తున్నా కూడా ఏపీ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. ఇది వాస్తవం అని ఆయన అంటున్నారు.

పంటలకు విరామం :

ఇక తెలంగాణా విషయానికి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విధానాల విషయంలో చాలా నెమ్మదిగా వ్యవహరించారు అని కేటీఆర్ విమర్శించారు. దాంతో ఇపుడు తెలంగాణా వ్యాప్తంగా పంటల విరామాన్ని చూడాల్సి వస్తోని అని అలాగే తెలంగాణా తీవ్రమైన కరవుని ఎదుర్కొంటోంది అని కేటీఆర్ మండిపడ్డారు. పక్కనున్న ఏపీలో చంద్రబాబు చొరవ చూపించి అన్నీ రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం నిదానంగా వ్యవహరించడం వల్ల ఎల్ నినో చిక్కుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయింది అని కేటీఆర్ ఎత్తి చూపారు. మొత్తానికి కేటీఆర్ చంద్రబాబు ముందు చూపుని కొనియాడడం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.