కేటీఅర్ కి బ్రేకులు వేసిన కవిత ?
బీఆర్ఎస్ లో అన్న ఆధిపత్యాన్ని పరోక్షంగా చెల్లెలు కవిత ప్రశ్నించినట్లుగా అంతా అనుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 May 2025 5:38 PM ISTబీఆర్ఎస్ లో అన్న ఆధిపత్యాన్ని పరోక్షంగా చెల్లెలు కవిత ప్రశ్నించినట్లుగా అంతా అనుకుంటున్నారు. చిత్రమేంటి అంటే ఒక రోజు తేడాలో మీడియాతో మాట్లాడిన అన్నా చెల్లెలు ఒకరి పేరుని మరొకరు లేవనెత్తలేదు. పరోక్షంగానే కామెంట్స్ చేసుకున్నారు అని అంటున్నారు. బాహాటంగా పార్టీ విషయాలు ఎవరూ చర్చించకూడదని, లేఖలు బాహాటంగా రాయకూడదని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నది తన చెల్లెలు కవిత గురించే అని అంటున్నారు.
ఇక చెల్లెలు కవిత కూడా పార్టీలో కేసీఆర్ చుట్టూ పెద్ద కోటరీ ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు. నిజానికి కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ ఎవరో కాదు కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, అలగే బంధువు సంతోష్, ఇక మిగిలింది కవిత. మరి ఈ నలుగురే కదా కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు అన్న మాట వినిపిస్తోంది.
మరి కోటరీ అని కుట్రదారులు అని కవిత ఇండైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు అన్న చర్చ వస్తోంది. అయితే బీఆర్ఎస్ లో వేగంగా మారుతున్న పరిణామాలు కేటీఆర్ కి తొందరగా పార్టీ పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో కవిత లేఖను ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు.
కేటీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తన స్థానం ఏమిటో చెప్పాలని కవిత కోరుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక కవిత లేఖ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కరే తమ నాయకుడు అని ప్రకటించారు తాము అందరమూ కార్యకర్తలమే అన్నారు. ఒక విధంగా కేసీఆర్ తోనే పార్టీ అన్నట్లుగా అటు కవిత కానీ ఇటు కేటీఆర్ కానీ అంగీకరించిన నేపధ్యంలో ఇపుడు కేసీఅర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
కవిత సైతం కేసీఆర్ విషయంలో ఏమీ అనడం లేదు. ఆయనను దేవుడు అంటున్నారు. ఆయనే తమ నాయకుడు అంటున్నారు. ఈ విధంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఆధిపత్యం పోరు సాగుతోందా అన్న ఇంప్రెషన్ అయితే బీఆర్ఎస్ లో ఉంది అని అంటున్నారు అయితే కేసీఆర్ అపర చాణక్యుడు అని ఆయన ఒక్కసారి రంగంలోకి దిగి సీరియస్ గా ఫోకస్ చేస్తే ఈ ఇష్యూ టీ కప్పులో తుఫాంగా మారిపోతుంది అన్న వారూ ఉన్నారు.
అయితే పార్టీలో తన అధికార వాటా అయితే కవిత తేల్చుకోవాలని అనుకుంటున్నారు. అలా ఆమె కేటీఆర్ పట్టాభిషేకానికి తన లేఖ ద్వారా తాత్కాలికంగా బ్రేకులు వేయగలిగారా అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే కేటీఆర్ కి కేసీఅర్ నుంచి పార్టీ పగ్గాలు అందడం అంత సులువు కాదని అంటున్నారు. దాంతో కవితను విశ్వాసంలోకి తీసుకోకపోతే బీఆర్ఎస్ లో సంక్షోభం అలాగే కొనసాగుతుందని అంటున్నారు.
మొత్తానికి చూస్తే కవిత ఎపిసోడ్ తో గులాబీ శ్రేణులు కూడా ఉలిక్కిపడుతున్నాయి. అదే సమయంలో కేటీఆర్ తన మీడియా సమావేశంలో సైతం కవిత లేఖ మీద పూర్తిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. కేసీఆర్ అన్న ఒక బిగ్ పిల్లర్ మీద ఏర్పడిన బీఆర్ఎస్ లో మళ్ళీ ఏకనాయత్వం అంటే కొంచెం కష్టమైన విషయమే అని అంటున్నారు ఈ రోజు కవిత ముందుకు వచ్చారు రేపటి రోజున హరీష్ రావు కూడా గొంతు చేస్తే సంగతేంటి అని అంటున్నారు. ఏది ఏమైనా కవిత లేఖ మాత్రం బీఆర్ఎస్ లో సాగుతున్న అంతర్గత సంఘర్షణను బయటపెట్టింది అని అంటున్నారు. చూడాలి మరి దీనిని కేసీఅర్ ఎలా పరిష్కరిస్తారో.
